Malaysia Open Super 750: ఆయుష్ అదిరెన్
ABN , Publish Date - Jan 07 , 2026 | 05:47 AM
భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి మలేసియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. స్థానిక ఆటగాడు, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లీ జి జియాకు...
ఒలింపిక్ పతక విజేతకు షాకిచ్చిన భారత షట్లర్
మలేసియా ఓపెన్‌లో లక్ష్య సేన్ ముందంజ
కౌలాలంపూర్: భారత యువ షట్లర్ ఆయుష్ శెట్టి మలేసియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. స్థానిక ఆటగాడు, పారిస్ ఒలింపిక్స్ కాంస్య పతక విజేత లీ జి జియాకు షాకిచ్చి సంచలనం సృష్టించాడు. మంగళవారం జరిగిన సింగిల్స్ ఆరంభ రౌండ్లో 20 ఏళ్ల ఆయుష్ 21-12, 21-17తో ప్రపంచ మాజీ రెండో ర్యాంకర్ లీ జి జియాను వరుస గేముల్లో చిత్తుచేశాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఆయుష్.. కేవలం అరగంటలోనే ప్రత్యర్థిని ఇంటిబాట పట్టించాడు. మరో భారత స్టార్ లక్ష్య సేన్ 21-16, 15-21, 21-14తో జియా హెంగ్ జాసన్ (సింగపూర్)ను ఓడించాడు. మిగతా భారత షట్లర్లలో సింగిల్స్‌లో మాళవిక బన్సోద్ 11-21, 11-21తో రచనోక్ ఇంటనాన్ (థాయ్‌లాండ్) చేతిలో, పురుషుల డబుల్స్‌లో అర్జున్/హరిహరన్ జోడీ 10-21, 20-22తో జపాన్ జంట హిరోకి/యమషిత చేతిలో ఓటమిపాలై తొలిరౌండ్లోనే వెనుదిరిగారు.
ఇవి కూడా చదవండి:
విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాదీ ప్లేయర్ డబుల్ సెంచరీ..
బీసీసీఐకి మరో కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయిన బంగ్లాదేశ్