Share News

ఆయుష్‌ అదిరెన్‌

ABN , Publish Date - Apr 09 , 2026 | 03:46 AM

భారత యువ షట్లర్‌ ఆయుష్‌ శెట్టి ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో అదరగొట్టాడు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ షి ఫెంగ్‌ (చైనా)కు షాకిచ్చి...

ఆయుష్‌ అదిరెన్‌

ఏడో ర్యాంకర్‌కు షాకిచ్చిన భారత షట్లర్‌

  • సింధు, ప్రణయ్‌ ముందంజ

  • శ్రీకాంత్‌, లక్ష్యసేన్‌ అవుట్‌

నింగ్బో (చైనా): భారత యువ షట్లర్‌ ఆయుష్‌ శెట్టి ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో అదరగొట్టాడు. పురుషుల సింగిల్స్‌లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ షి ఫెంగ్‌ (చైనా)కు షాకిచ్చి రెండోరౌండ్‌కు దూసుకెళ్లాడు. బుధవారం ఇక్కడ జరిగిన తొలిరౌండ్‌ పోరులో ప్రపంచ 25వ ర్యాంకరైన ఆయుష్‌ 21-13, 21-16తో లిన్‌ను చిత్తుగా ఓడించాడు. సీనియర్‌ షట్లర్‌ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ 24-22, 21-12తో గుయెన్‌ హై డాంగ్‌ (వియత్నాం)పై గెలవగా.. కిడాంబి శ్రీకాంత్‌ 21-18, 9-21, 11-21తో లో కీన్‌ యే (సింగపూర్‌) చేతిలో, లక్ష్యసేన్‌ 12-21, 19-21తో లీ చుక్‌ యు (హాంకాంగ్‌) చేతిలో ఓడి ఆరంభ రౌండ్లోనే ఇంటిబాట పట్టారు. మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు 15-21, 21-11, 21-19తో వోంగ్‌ లింగ్‌ చింగ్‌ (మలేసియా)పై, ఉన్నతి హుడా 23-25, 21-8, 21-18తో సుపనిద (థాయ్‌లాండ్‌)పై నెగ్గి రెండోరౌండ్‌ చేరగా.. మాళవిక, తన్వీ శర్మ ప్రత్యర్థుల చేతిలో ఓడి వెనుదిరిగారు. మహిళల డబుల్స్‌లో శ్రుతి మిశ్రా/ప్రియ జోడీ తొలిరౌండ్‌ దాటింది.

ఇవి కూడా చదవండి:

ఎంఐపై హాఫ్ సెంచరీ మిస్.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ

ఎంఐ-ఆర్ఆర్: మా ఓటమికి బౌలర్లే ప్రధాన కారణం.. హార్దిక్ పాండ్య

Updated Date - Apr 09 , 2026 | 03:46 AM