Share News

క్వార్టర్స్‌లో ఆయుష్‌

ABN , Publish Date - Apr 10 , 2026 | 01:57 AM

భారత యువ షట్లర్‌ ఆయుష్‌ షెట్టి ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకుపోయాడు...

క్వార్టర్స్‌లో ఆయుష్‌

సింధు, ప్రణయ్‌ అవుట్‌

నింగ్బో (చైనా): భారత యువ షట్లర్‌ ఆయుష్‌ షెట్టి ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో క్వార్టర్‌ఫైనల్‌కు దూసుకుపోయాడు. అయితే పీవీ సింధు పోరాటం ప్రీక్వార్టర్స్‌కే పరిమితమైంది. గురువారం జరిగిన మ్యాచ్‌లో ఆయుష్‌ 21-16, 21-12తో వరల్డ్‌ నెం.20 చి యు జెన్‌ (తైపీ)ని చిత్తు చేశాడు. కాగా సింధు 18-21, 8-21తో రెండో సీడ్‌ వాంగ్‌ ఝీయీ (చైనా) చేతిలో ఓటమితో ప్రీక్వార్టర్‌ఫైనల్‌ నుంచి వెనుదిరిగింది. అలాగే హెచ్‌ఎ్‌స ప్రణయ్‌ 12-21, 19-21తో వెంగ్‌ హాంగ్‌ యాంగ్‌ (చైనా) చేతిలో ఓటమి పా లయ్యాడు. మిక్స్‌డ్‌లో ధ్రువ్‌ కపిల/తనీషా క్రాస్టో జోడీ 13-21, 14-21తో మలేసియా ద్వయం చెన్‌ టాంగ్‌/టో ఈ వీ చేతిలో రౌండ్‌-16లో ఓడింది. ఇక ఉన్నతి హుడా 17-21, 9-21తో మియజాకి (జపాన్‌) చేతిలో ఓడగా, మహిళల డబుల్స్‌లో ప్రియ/శ్రుతి జంట కూడా నిష్క్రమించింది.

ఇవి కూడా చదవండి:

ఎంఐపై హాఫ్ సెంచరీ మిస్.. వెక్కి వెక్కి ఏడ్చిన వైభవ్ సూర్యవంశీ

ఎంఐ-ఆర్ఆర్: మా ఓటమికి బౌలర్లే ప్రధాన కారణం.. హార్దిక్ పాండ్య

Updated Date - Apr 10 , 2026 | 01:57 AM