Share News

ఆయుష్‌.. అదే జోష్‌

ABN , Publish Date - Apr 11 , 2026 | 05:09 AM

ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో భారత యువ కెరటం ఆయుష్‌ శెట్టి దూకుడు కొనసాగుతోంది. గత రౌండ్లలో టాప్‌ షట్లర్లకు ఝలకిచ్చిన ఆయుష్‌.. క్వార్టర్స్‌లో...

ఆయుష్‌.. అదే జోష్‌

  • నాలుగో ర్యాంకర్‌ జొనాథన్‌కు షాక్‌

  • ఆసియా బ్యాడ్మింటన్‌లో సెమీ్‌సకు

నింగ్బో (చైనా): ఆసియా బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌పలో భారత యువ కెరటం ఆయుష్‌ శెట్టి దూకుడు కొనసాగుతోంది. గత రౌండ్లలో టాప్‌ షట్లర్లకు ఝలకిచ్చిన ఆయుష్‌.. క్వార్టర్స్‌లో మరో స్టార్‌కు షాకిచ్చి టైటిల్‌ రేసులో మరింత ముందుకెళ్లాడు. శుక్రవారం జరిగిన పోరులో ఆయుష్‌ 23-21, 21-17తో ప్రపంచ నాలుగో ర్యాంకరైన జొనాథన్‌ క్రిస్టీ (ఇండోనేసియా)ని చిత్తుచేసి సెమీఫైనల్‌కు దూసుకెళ్లాడు. మూడోసీడ్‌ జొనాథన్‌పై ఆరంభం నుంచే కచ్చితమైన షాట్లతో విరుచుకుపడిన ఆయుష్‌.. 54 నిమిషాల్లో మ్యాచ్‌ను ముగించాడు. శనివారం జరిగే సెమీస్‌లో పారిస్‌ ఒలింపిక్స్‌ రజత పతక విజేత, ప్రపంచ మాజీ చాంపియన్‌, టాప్‌సీడ్‌ కున్లావత్‌ వితిసార్న్‌ (థాయ్‌లాండ్‌)తో ఆయుష్‌ తలపడనున్నాడు. టోర్నీలో భారత్‌ తరఫున ఆయుష్‌ ఒక్కడే బరిలో మిగిలాడు. సింధు, ప్రణయ్‌లాంటి స్టార్లంతా క్వార్టర్స్‌కు ముందే వెనుదిరిగిన సంగతి తెలిసిందే.

ఈ వార్తలు కూడా చదవండి

మహిళల జోలికొస్తే అదే చివరి రోజు: మంత్రి సవిత..

బొత్స భావోద్వేగం.. వైఎస్ షర్మిల రియాక్షన్

Updated Date - Apr 11 , 2026 | 05:09 AM