Alyssa Healy Retirement: భారత్‌తో సిరీస్ తర్వాత క్రికెట్‌కు హీలీ గుడ్‌బై
ABN , Publish Date - Jan 14 , 2026 | 06:19 AM
ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ స్టార్, కెప్టెన్ అలిస్సా హీలీ త్వరలోనే కెరీర్‌కు గుడ్‌బై చెప్పనుంది. కొద్దిరోజుల్లో సొంతగడ్డపై భారత్‌తో జరిగే సిరీసే తనకు ఆఖరిదని...
సిడ్నీ: ఆస్ట్రేలియా మహిళల క్రికెట్ స్టార్, కెప్టెన్ అలిస్సా హీలీ త్వరలోనే కెరీర్‌కు గుడ్‌బై చెప్పనుంది. కొద్దిరోజుల్లో సొంతగడ్డపై భారత్‌తో జరిగే సిరీసే తనకు ఆఖరిదని 35 ఏళ్ల హీలీ మంగళవారం ప్రకటించింది. ఆ సిరీస్‌లో భాగంగా ఫిబ్రవరి 15 నుంచి ఆతిథ్య ఆసీ్‌సతో భారత్ 3 టీ20లు, 3 వన్డేలు, ఓ టెస్టు ఆడనుంది. వికెట్ కీపర్, బ్యాటర్ అయిన అలిస్సా.. దశాబ్దకాలంగా ఆస్ట్రేలియా జట్టు విజయాల్లో కీలకపాత్ర పోషించింది. జట్టు సభ్యురాలిగా ఆమె ఖాతాలో 6 టీ20, 2 వన్డే ప్రపంచక్‌పలు ఉండడం విశేషం. మూడేళ్ల క్రితం మెగ్ లానింగ్ స్థానంలో జట్టు పగ్గాలు స్వీకరించిన అలిస్సా తన సారథ్యంలో జట్టును టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచక్‌పలో సెమీస్ చేర్చింది. 10 టెస్టులు, 123 వన్డేలు, 162 టీ20లకు ప్రాతినిథ్యం వహించిన అలిస్సా.. ఆసీస్ దిగ్గజ పేసర్ మిచెల్ స్టార్క్‌కు సతీమణి.
ఇవి కూడా చదవండి:
ధనశ్రీతో రియాలిటీ షో.. ఆ వార్తలను ఖండించిన చాహల్
రో-కో నన్ను ‘చోటా చీకూ’ అని పిలిచారు: విరాట్ పోలికలతో ఉన్న బాలుడు