Share News

Australian Open Prize Money: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేతకు రూ. 25 కోట్లు

ABN , Publish Date - Jan 07 , 2026 | 05:28 AM

సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రైజ్‌మనీని భారీగా పెంచారు. పురుషులు, మహిళల విజేతలకు...

Australian Open Prize Money: ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేతకు రూ. 25 కోట్లు

మెల్‌బోర్న్‌: సీజన్‌ తొలి గ్రాండ్‌స్లామ్‌ ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ ప్రైజ్‌మనీని భారీగా పెంచారు. పురుషులు, మహిళల విజేతలకు చెరి రూ. 25.14 కోట్ల నగదు బహుమతి దక్కనుంది. గతేడాదితో పోల్చితే ఇది 19 శాతం అదనం. కాగా, ఓవరాల్‌గా ప్రైజ్‌మనీని 2025 కంటే 16 శాతం మేర పెంచినట్టు నిర్వాహకులు తెలిపారు. గతేడాది ప్రైజ్‌పూల్‌ సుమారు రూ. 584 కోట్లు కాగా.. ఈ సీజన్‌లో అది రూ. 675 కోట్లకు చేరింది. టోర్నీ ఈ నెల 18 నుంచి జరగనుంది.

ఇవి కూడా చదవండి:

విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాదీ ప్లేయర్ డబుల్ సెంచరీ..

బీసీసీఐకి మరో కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయిన బంగ్లాదేశ్

Updated Date - Jan 07 , 2026 | 05:28 AM