Share News

ఆస్ట్రేలియా 187/6

ABN , Publish Date - Oct 10 , 2026 | 03:00 AM

దక్షిణాఫ్రికాతో శుక్రవారం ఆరంభమైన తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఇక్కట్లలో పడింది.

ఆస్ట్రేలియా 187/6
Australia vs South Africa Test

  • దక్షిణాఫ్రికాతో తొలి టెస్ట్‌

డర్బన్‌: దక్షిణాఫ్రికాతో శుక్రవారం ఆరంభమైన తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా ఇక్కట్లలో పడింది. ఆతిథ్య జట్టు పేసర్లు విజృంభించడంతో మొదటి రోజు ఆఖరికి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 187 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయింది. రెన్‌షా (46), కమిన్స్‌ (33) క్రీజులో ఉన్నారు. ముల్డర్‌, యాన్సెన్‌, నోకియా తలా రెండేసి వికెట్లు పడగొట్టారు.


మాడిసన్‌ చెత్త రికార్డు: పదేళ్ల తర్వాత జట్టులో పునరాగమనం చేసిన ఆస్ట్రేలియా ఓపెనర్‌ నిక్‌ మాడిసన్‌ అత్యంత చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. 33 బంతులు ఎదుర్కొన్న అతడు ఒక్క పరుగు కూడా చేయకుండానే అవుటయ్యాడు. ఇలా అత్యధిక బంతులు ఆడి డకౌటైన మూడో ఓపెనర్‌గా రికార్డు పుటలకెక్కాడు. నిక్‌ 2016-17 లో స్వదేశంలో దక్షిణాఫ్రికాపైనే టెస్ట్‌ అరంగేట్రం చేశాడు. ఇక..ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తుది 11 మందిలో అందరూ 30 లేదా అంతకంటే ఎక్కువ వయస్సువారే.


ఇవి కూడా చదవండి:

శాండ్ పేపర్ వివాదంపై లక్షలసార్లు సమాధానం చెప్పా: ప్యాట్ కమిన్స్

గంగూలీ బయోపిక్ ‘దాదా’ పోస్టర్‌పై విమర్శలు.. హీరో రియాక్షన్ ఇదే!

Updated Date - Oct 10 , 2026 | 03:00 AM