అమ్మాయిల పోరు ముందుగానే..
ABN , Publish Date - Sep 17 , 2026 | 05:46 AM
ఆసియా క్రీడలకు వేళైంది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ఖండం ఆటల పోటీలు ఈనెల 19న అయిచి-నగోయాలో మొదలుకానున్నాయి..
నేటి మ్యాచ్‌లు
తొలి క్వార్టర్‌ఫైనల్
బంగ్లాదేశ్ X చైనా (ఉ. 5.30 నుంచి)
రెండో క్వార్టర్‌ఫైనల్
పాకిస్థాన్ X థాయ్‌లాండ్(ఉ.10.30 నుంచి)
(సోనీ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో..)
నేటినుంచి ఆసియాడ్ క్రికెట్
నిషిన్ (జపాన్) : ఆసియా క్రీడలకు వేళైంది. నాలుగేళ్లకోసారి జరిగే ఈ ఖండం ఆటల పోటీలు ఈనెల 19న అయిచి-నగోయాలో మొదలుకానున్నాయి. అయితే ఆసియాడ్‌లో మహిళల క్రికెట్ టోర్నమెంట్‌కు మాత్రం గురువారమే తెరలేవనుంది. ఎనిమిది జట్లు..భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్థాన్, చైనా, జపాన్, మలేసియా, థాయ్‌లాండ్ బరిలో దిగుతున్నాయి. టీ20 ఫార్మాట్‌లో నాకౌట్ పద్ధతిన టోర్నీ జరగనుంది. గురు, శుక్రవారాల్లో రోజుకు రెండు చొప్పున క్వార్టర్‌ఫైనల్స్ నిర్వహిస్తారు. భారత్-జపాన్ నాలుగో క్వార్టర్‌ఫైనల్లో తలపడతాయి. ఈనెల 20న రెండు సెమీఫైనల్స్ ఉంటా యి. 22న ఫైనల్ పోరు జరుగుతుంది.
భారత్-పాక్ పోరు ఎప్పుడు ?
టోర్నమెంట్‌లో ఇరుజట్లు పురోగమిస్తే ఫైనల్లో మాత్రమే తలపడగలవు. ఇరు జట్లు సెమీఫైనల్లోకి అడుగుపెడితే..బంగ్లాదేశ్-చైనా మ్యాచ్ విజేతను భారత్ ఢీ కొంటుంది. శ్రీలంక-మలేసియా పోరులో గెలిచిన జట్టుతో పాక్ సెమీస్ ఆడుతుంది.
జపాన్ చేరిన భారత్: డిఫెండింగ్ చాంపియన్ భారత మహిళల జట్టు బుధవారం జపాన్ చేరుకుంది. ఆతిథ్య జపాన్‌తో క్వార్టర్‌ఫైనల్ ద్వారా టీమిండియా టోర్నమెంట్‌ను ఆరంభించనుంది. ఇటీవలే ఆసియా కప్ గెలిచిన ఆత్మవిశ్వాసంతో భారత్ ఇక్కడకు అడుగుపెట్టింది. అదే జోరును ఆసియాడ్‌లోనూ కొనసాగించి మరోసారి పసిడి పతకం సొంతం చేసుకోవాలని హర్మన్‌ప్రీత్ సేన పట్టుదలగా ఉంది.
Also Read:
భారత సినీ రంగానికి అనంత్ నాగ్ సేవలు స్ఫూర్తిదాయకం: పవన్ కల్యాణ్
రుణాల మంజూరుపై బ్యాంకులు దృష్టి పెట్టాలి: సీఎం చంద్రబాబు