Share News

రోషిబినా.. స్వర్ణ పథాన

ABN , Publish Date - Sep 24 , 2026 | 06:00 AM

ఉషు స్టార్‌ రోషిబినా దేవి ఆసియా క్రీడల పసిడి పతక రేసుకు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన ఉషు మహిళల 60కి. సాండా విభాగంలో రోషిబినా దేవి ఫైనల్లో అడుగుపెట్టింది...

రోషిబినా.. స్వర్ణ పథాన

  • ఉషు ఫైనల్లో భారత స్టార్‌

  • ఆసియాడ్‌లో హాకీ జోరు

నగోయ: ఉషు స్టార్‌ రోషిబినా దేవి ఆసియా క్రీడల పసిడి పతక రేసుకు దూసుకెళ్లింది. బుధవారం జరిగిన ఉషు మహిళల 60కి. సాండా విభాగంలో రోషిబినా దేవి ఫైనల్లో అడుగుపెట్టింది. సెమీఫైనల్లో..ఇండోనేసియాకు చెందిన థానియా కుసుమనింగ్త్యా్‌సపై 2-0తో రొషిబినా విజయం సాధించింది. గురువారం జరిగే ఫైనల్లో షియాయు ఝాంగ్‌ (చైనా)తో 25 ఏళ్ల రోషిబినా అమీతుమీ తేల్చుకుంటుంది.

కబడ్డీ జట్ల ముందంజ: కబడ్డీలో డిఫెండింగ్‌ చాంపియన్లు భారత మహిళలు, పురుషుల జట్లు దూసుకుపోతున్నాయి. మహిళల జట్టు 37-23తో ఇరాన్‌ను, పురుషుల బృందం 48-25తో బంగ్లాదేశ్‌ను ఓడించి హ్యాట్రిక్‌ విజయాలు నమోదు చేశాయి.

హాకీ మహిళల హ్యాట్రిక్‌: మహిళల హాకీ పూల్‌ ‘బి’ మ్యాచ్‌లో భారత్‌ 20-1తో థాయ్‌లాండ్‌ను చిత్తు చేసింది. డ్రాగ్‌ ఫ్లికర్‌ దీపిక 9 గోల్స్‌తో దుమ్ము రేపింది. ఆసియాడ్‌లో ఒక మ్యాచ్‌లో అత్యధిక గోల్స్‌ చేసిన భారత క్రీడాకారిణిగా రికార్డు నెలకొల్పింది. భారత మహిళలకు ఇది హ్యాట్రిక్‌ గెలుపు.

టీటీ, స్క్వాష్‌లో జోరు: హర్మీత్‌/యశస్వినీ, దియా చిటాలే/మానుష్‌ షా జంటలు టేబుల్‌ టెన్నిస్‌ (టీటీ) మిక్స్‌డ్‌ డబుల్స్‌లో క్వార్టర్‌ఫైనల్‌కు చేరాయి. ఇక, స్క్వాష్‌లో అభయ్‌ సింగ్‌, వీర్‌ చోత్రానీ, తన్వీ సింగిల్స్‌లో ప్రీక్వార్టర్స్‌లో అడుగుపెట్టారు. బాక్సింగ్‌ పురుషుల 80 కి.లలో అనుకుష్‌ క్వార్టర్స్‌కు చేరాడు. రోయింగ్‌ పురుషుల క్వాడ్రపుల్‌ స్కల్స్‌, ఉమెన్స్‌ ఫోర్‌లో భారత్‌ ఫైనల్‌కు చేరింది. పురుషుల డబుల్స్‌ స్కల్స్‌లో రోహిత్‌/ఉజ్వల్‌ ఫైనల్‌కు క్వాలిఫై అయ్యారు. రోయింగ్‌ పురుషుల క్వాడ్రపుల్‌ స్కల్స్‌, ఉమెన్స్‌ ఫోర్‌లో భారత్‌ ఫైనల్‌కు చేరింది.

ఇవీ చదవండి:

ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు

Updated Date - Sep 24 , 2026 | 06:00 AM