Share News

ఆసియా క్రీడలు.. భారత్‌కు మరో రజతం, కాంస్యం.. 17కి చేరిన మొత్తం పతకాలు

ABN , Publish Date - Sep 24 , 2026 | 09:29 PM

ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు తమ సత్తా చాటారు. 4 X 400 రిలే రేసులో రజతంతో పాటు 10 వేల మీటర్ల పరుగు పందెంలో కాస్యం గెలిచారు.

ఆసియా క్రీడలు.. భారత్‌కు మరో రజతం, కాంస్యం.. 17కి చేరిన మొత్తం పతకాలు
Asian Games

ఇంటర్నెట్ డెస్క్: ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు తమ సత్తా చాటారు. 4 X 400 రిలే రేసులో రజతంతో పాటు 10 వేల మీటర్ల పరుగు పందెంలో కాస్యం గెలిచారు. 16 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ 10 వేల మీటర్ల పరుగు పందెంలో సీమా కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నారు.

4 X 400 రిలే రేసులో మను, పూవమ్మ, విశాల్, విద్యలతో కూడిన భారత బృందం 3.14.46 నిమిషాల్లో రేసును ముగించి రజతం సొంతం చేసుకుంది. అయితే, బహ్రెయిన్ జట్టు 3.12.87 నిమిషాల్లోనే రేసు పూర్తి చేసి విజేతగా నిలవడంతో భారత్‌కు తృటిలో స్వర్ణ పతకం తప్పింది.


ఇక 10 వేల మీటర్ల రేసులో సీమా కుమారి 32.50.05 నిమిషాల్లో రేసును పూర్తి చేసి కాంస్యాన్ని సొంతం చేసుకున్నారు. 16 ఏళ్ల తరువాత ఆమె దేశానికి పతకం సాధించిపెట్టడంతో ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు. యావత్ దేశం ఆమెను చూసి గర్విస్తోందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పారు. ఈ పోటీలో బహ్రెయిన్‌‌‌కు విన్‌ఫ్రెడ్ స్వర్ణం, జపాన్‌కు చెందిన నొజోమీ తనకా రజతాన్ని సొంతం చేసుకున్నారు.

గురువారం కూడా భారత క్రీడాకారులు పతకాలు సాధించడంలో మొత్తం పతకాల సంఖ్య 17కు పెరిగింది. ఏషియన్ గేమ్స్‌లో భారత క్రీడాకారులు ఇప్పటి వరకూ ఒక స్వర్ణం, ఏడు రజత పతకాలు, తొమ్మిది కాంస్య పతకాలు సొంతం చేసుకున్నారు.


ఈ వార్తలనూ చదవండి:

వరుసగా మూడో పతకం.. ఆసియా క్రీడల్లో రోషిబినా దేవికి రజతం..

అప్పుడు మల్లి.. ఇప్పుడు మీరా!

Updated Date - Sep 24 , 2026 | 10:46 PM