Share News

హ్యాట్రిక్‌పై తజిందర్‌ గురి

ABN , Publish Date - Sep 24 , 2026 | 05:55 AM

షాట్‌పుటర్‌ తజిందర్‌ పాల్‌ తూర్‌ హ్యాట్రిక్‌ స్వర్ణంపై గురిపెట్టగా.. లాంగ్‌ జంపర్‌ మురళీ శ్రీశంకర్‌, లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ గుల్వీర్‌ సింగ్‌ పతకం రంగు..

హ్యాట్రిక్‌పై తజిందర్‌ గురి

బరిలో తెలుగు స్టార్లు జ్యోతి, వెంకట్రామ్‌

నేటి నుంచే అథ్లెటిక్స్‌

నగోయ: షాట్‌పుటర్‌ తజిందర్‌ పాల్‌ తూర్‌ హ్యాట్రిక్‌ స్వర్ణంపై గురిపెట్టగా.. లాంగ్‌ జంపర్‌ మురళీ శ్రీశంకర్‌, లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ గుల్వీర్‌ సింగ్‌ పతకం రంగు మార్చుకోవాలనుకొంటున్నారు. భారత్‌ ఎక్కువ పతక అంచనాలు పెట్టుకొన్న ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్స్‌ ఈవెంట్లు గురువారం మొదలవనున్నాయి. 75 మంది సభ్యుల బృందం ఈసారి 25-30 పతకాలు సాధించాలని లక్ష్యంగా నిర్దేశించుకొంది. గత హాంగ్‌ఝౌ క్రీడల్లో మన అథ్లెట్లు 6 స్వర్ణాలు సహా 29 పతకాలు కొల్లగొట్టారు. తెలుగు అథ్లెట్లు యర్రాజి జ్యోతి (100 మీ. హర్డిల్స్‌), ఎం. వెంకట్రామ్‌ రెడ్డి (800 మీ.) కూడా బరిలో ఉన్నారు. ఇక గత రెండు ఆసియా క్రీడల్లో పసిడి నెగ్గిన తజిందర్‌.. మరో స్వర్ణం సాధిస్తే, వరుసగా మూడో మెడల్‌ దక్కించుకొన్న తొలి భారత అథ్లెట్‌గా రికార్డు సృష్టిస్తాడు. ట్రిపుల్‌ జంపర్‌ ఆషాతోపాటు 10,000 మీ. రన్నర్‌ సీమ, 4్ఠ400 రిలే మిక్స్‌డ్‌ జట్టు కూడా భారీ అంచనాలతో బరిలోకి దిగనుంది. లాంగ్‌ డిస్టెన్స్‌ రన్నర్‌ గుల్వీర్‌పై అందరి దృష్టీ నెలకొంది.

ఇవీ చదవండి:

ఎన్నికల కమిషన్‌లో విభేదాలపై దుమారం.. ఖండించిన ఈసీ

ఐఐటీ బాంబే విద్యార్థి ఆత్మహత్య ఘటన.. ప్రొఫెసర్‌పై కేసు

Updated Date - Sep 24 , 2026 | 05:56 AM