ఆసియాడ్ జట్టు నుంచి నిత్యకు ఉద్వాసన
ABN , Publish Date - Sep 12 , 2026 | 06:16 AM
తెలుగు స్ర్పింటర్ నిత్య గంధెతో పాటు గత క్రీడల స్వర్ణ పతక విజేత, జావెలిన్ త్రోయర్ అన్నూ రాణి, యువ లాంగ్‌జంపర్ షానవాజ్ ఖాన్‌లను...
న్యూఢిల్లీ: తెలుగు స్ర్పింటర్ నిత్య గంధెతో పాటు గత క్రీడల స్వర్ణ పతక విజేత, జావెలిన్ త్రోయర్ అన్నూ రాణి, యువ లాంగ్‌జంపర్ షానవాజ్ ఖాన్‌లను భారత ఆసియా క్రీడల అథ్లెటిక్స్ జట్టు నుంచి తప్పించారు. ఆసియాడ్‌కు తొలుత 74 మందితో ట్రాక్ అండ్ ఫీల్డ్ అథ్లెట్ల బృందాన్ని భారత అథ్లెటిక్స్ సమాఖ్య (ఏఎ్‌ఫఐ) ప్రకటించింది. ఆసియాడ్ క్వాలిఫికేషన్ మార్క్ అందుకోనందున అన్నూను, పేలవ ప్రదర్శన, వైద్యపరమైన అంశాలు లాంటి కారణాలతో నిత్య, షానవాజ్‌లను జట్టు నుంచి తొలగించామని ఏఎ్‌ఫఐ శుక్రవారం తెలిపింది. దీంతో ఆసియాడ్‌లో ట్రాక్ అండ్ ఫీల్డ్ నుంచి భారత్ 73 మందితోనే బరిలోకి దిగనుంది. జపాన్ వేదికగా ఈనెల 19 నుంచి ఆసియా క్రీడలు జరగనున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి
ఆర్‌డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లకు గుడ్ న్యూస్.. రూ.620 కోట్లు విడుదల చేసిన కూటమి ప్రభుత్వం..
2027 నాటికి వందశాతం అక్షరాస్యతే లక్ష్యం.. కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం