Share News

హాకీ అమ్మాయిల దూకుడు

ABN , Publish Date - Sep 22 , 2026 | 05:43 AM

ఫార్వర్డ్‌లు దీపిక సెహ్రావత్‌, రుతుజ, నవ్‌నీత్‌ కౌర్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో అదరగొట్టడంతో ఆసియా క్రీడల మహిళల హాకీలో భారత జట్టు దుమ్ము రేపింది. పూల్‌ ‘బి’ సోమవారం జరిగిన మ్యాచ్‌లో...

హాకీ అమ్మాయిల దూకుడు

ఇండోనేసియాపై భారత్‌ ఘన విజయం

నగోయ: ఫార్వర్డ్‌లు దీపిక సెహ్రావత్‌, రుతుజ, నవ్‌నీత్‌ కౌర్‌ హ్యాట్రిక్‌ గోల్స్‌తో అదరగొట్టడంతో ఆసియా క్రీడల మహిళల హాకీలో భారత జట్టు దుమ్ము రేపింది. పూల్‌ ‘బి’ సోమవారం జరిగిన మ్యాచ్‌లో మనోళ్లు 17-1తో ఇండోనేసియాను చిత్తు చేశారు. తద్వారా గ్రూపులో వరుసగా రెండో విజయం సాధించారు.

బ్యాడ్మింటన్‌ క్వార్టర్‌ఫైనల్లో పురుషుల జట్టు

బంగ్లాదేశ్‌ను 3-0తో ఓడించిన భారత పురుషుల జట్టు బ్యాడ్మింటన్‌ క్వార్టర్‌ఫైనల్‌కు చేరింది. లక్ష్యసేన్‌, ఆయుష్‌ షెట్టి, కిడాంబి శ్రీకాంత్‌ తమతమ మ్యాచ్‌లు గెలుపొందారు. మంగళవారం జరిగే రౌండ్‌-8లో జపాన్‌తో భారత్‌ అమీతుమీ తేల్చుకుంటుంది. మహిళల జట్టు కూడా క్వార్టర్స్‌లో జపాన్‌తోనే తలపడనుంది.

టీటీ క్వార్టర్స్‌లో మహిళల జట్టు

భారత మహిళల జట్టు టీటీ క్వార్టర్‌ఫైనల్లో అడుగు పెట్టింది. గ్రూప్‌ ‘ఎఫ్‌’లో జరిగిన పోరులో 3-0తో పాకిస్థాన్‌ను మనోళ్లు ఓడించారు. వరుసగా మూడు విజయాలు దక్కించుకున్న భారత జట్టు క్వార్టర్‌ఫైనల్‌కు ప్రవేశించింది.

కబడ్డీలో శుభారంభం

డిఫెండింగ్‌ చాంపియన్లు భారత మహిళలు, పురుషుల కబడ్డీ జట్లకు ఘనమైన ఆరంభం దక్కింది. గ్రూప్‌ ‘ఎ’ తొలి మ్యాచ్‌లో మహిళల జట్టు 42-21తో బంగ్లాదేశ్‌పై గెలుపొందింది. గ్రూప్‌ ‘ఎ’లోనే తలపడుతున్న పురుషుల జట్టు తొలి మ్యాచ్‌లో 49-24తో ఆతిథ్య జపాన్‌పై నెగ్గింది.

ప్రీక్వార్టర్స్‌లో బాక్సర్‌ సుమిత్‌

బాక్సింగ్‌ పురుషుల 70 కిలోల విభాగంలో సుమిత్‌ కుందు 5-0తో బున్‌జోంగ్‌ సిన్‌సిరి (థాయ్‌లాండ్‌)ను చిత్తు చేసి ప్రీక్వార్టర్‌ ఫైనల్‌కు చేరాడు.

సెపెక్‌తక్రాలో ఓటమి

సెపెక్‌తక్రా పురుషుల రెగు గ్రూప్‌‘ఎ’లో పోటీ పడుత్ను భారత్‌ ఆరంభ మ్యాచ్‌లో 1-2తో జపాన్‌ చేతిలో ఓడింది. మంగళవారం జరిగే రెండో మ్యాచ్‌లో మలేసియాను భారత్‌ ఢీకొంటుంది.

స్విమ్మర్‌ శ్రీహరికి 10వ స్థానం

సీనియర్‌ స్విమ్మర్‌ శ్రీహరి నటరాజ్‌ పురుషుల 50 మీ. బ్యాక్‌స్ట్రోక్‌ ఫైనల్లో (25.52సె.) 10వ, ఆఖరి స్థానంలో నిలిచాడు. పురుషుల 50 మీ. బ్రెస్ట్‌స్ట్రోక్‌లో రిషభ్‌ దాస్‌ (25.41సె.) కొద్దిలో ఫైనల్‌ బెర్త్‌ కోల్పోయాడు. సాజన్‌ ప్రకాష్‌, శశికుమార్‌, తమిళ నటుడు మాధవన్‌ కుమార్‌ వేదాంత్‌ మాధవన్‌, అనీష్‌ సునీల్‌తో కూడిన భారత జట్టు (7ని.24.32సె.) 4-200 మీ. ఫ్రీస్టయిల్‌ రిలే ఫైనల్లో అడుగుపెట్టడంలో విఫలమైంది.

ఇవి కూడా చదవండి:

ఆసియా గేమ్స్: కుమారుడి టీమ్ ఓటమి.. మాధవన్ రియాక్షన్ ఇదే!

న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్.. రిజర్వ్ ఓపెనర్ రేసులో సాయి సుదర్శన్

Updated Date - Sep 22 , 2026 | 05:44 AM