Share News

ఆసియాడ్‌కు 492 మంది

ABN , Publish Date - Aug 23 , 2026 | 05:38 AM

వచ్చేనెల 19 నుంచి జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు భారత్‌ నుంచి 492 మంది అథ్లెట్లకు కేంద్ర క్రీడాశాఖ ఆమోదం తెలిపింది...

ఆసియాడ్‌కు 492 మంది

న్యూఢిల్లీ: వచ్చేనెల 19 నుంచి జపాన్‌లో జరిగే ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు భారత్‌ నుంచి 492 మంది అథ్లెట్లకు కేంద్ర క్రీడాశాఖ ఆమోదం తెలిపింది. ఇందులో 265 మంది పురుష, 227 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. అత్యధికంగా ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెటిక్స్‌ నుంచి 73 మంది, బ్యాడ్మింటన్‌ ననుంచి 20 మంది భారత బృందంలో ఉన్నారు. వీరిలో తెలుగు తేజాలు సింధు, సాత్విక్‌, గాయత్రి, ఇషా సింగ్‌, జ్యోతి సురేఖ, దీరజ్‌, చికిత, క్రికెటర్లు తిలక్‌, నితీష్‌, యర్రాజీ జ్యోతి, నిత్య గంధె, వెంకట్రామ్‌ రెడ్డి ఉన్నారు.

ఇవి కూడా చదవండి

ఆ అవమానకర వ్యాఖ్యల వెనుక ఉన్న అసలు వ్యక్తులను గుర్తించాలి: కొండా సురేఖ

డీఎస్సీపై జగన్‌కు మరోసారి సవాల్ విసిరిన మంత్రి లోకేశ్

Updated Date - Aug 23 , 2026 | 05:38 AM