Share News

తుదిపోరుకు అస్మిత

ABN , Publish Date - Aug 09 , 2026 | 05:14 AM

భారత వర్ధమాన షట్లర్‌ అస్మిత చలిహా కొరియా మాస్టర్స్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో జోరు...

తుదిపోరుకు అస్మిత

  • సెమీ్‌సలో రక్షితపై గెలుపు

  • కొరియా మాస్టర్స్‌

అసన్‌ (కొరియా): భారత వర్ధమాన షట్లర్‌ అస్మిత చలిహా కొరియా మాస్టర్స్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో జోరు కొనసాగిస్తూ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. భారత్‌కే చెందిన రక్షిత రామ్‌రాజ్‌ను ఓడించి ఫైనల్లో ప్రవేశించింది. శనివారం హోరాహోరీగా జరిగిన మహిళల సింగిల్స్‌ సెమీఫైనల్లో అసోంకు చెందిన అస్మిత 21-13, 16-21, 21-13తో రక్షితపై గెలిచింది. తద్వారా తొలిసారి బ్యాడ్మింటన్‌ వరల్డ్‌ ఫెడరేషన్‌ (బీడబ్ల్యూఎఫ్‌) టూర్‌ సింగిల్స్‌ ఫైనల్‌కు చేరింది. ఆదివారం జరిగే తుదిపోరులో చైనాకు చెందిన హాన్‌ క్వియాన్‌షిని అస్మిత ఎదుర్కొంటుంది.

ఇవి కూడా చదవండి:

టీమిండియాకు మరో ఎదురు దెబ్బ.. కీలక ప్లేయర్ ఔట్!

చరిత్ర సృష్టించిన రషీద్ ఖాన్.. మూడు సార్లు 6 వికెట్లు

Updated Date - Aug 09 , 2026 | 05:14 AM