Jacob Bethells Maiden Century: బెతెల్ బాదినా...
ABN , Publish Date - Jan 08 , 2026 | 05:44 AM
ఊహించినట్టుగానే యాషెస్ ఐదో టెస్ట్ ఐదో రోజుకు చేరింది. జాకబ్ బెతెల్ (142 బ్యాటింగ్) తొలి టెస్ట్ శతకం సాధించడంతో..ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో...
కష్టాల్లో ఇంగ్లండ్.. రెండో ఇన్నింగ్స్ 302/8
సిడ్నీ: ఊహించినట్టుగానే యాషెస్ ఐదో టెస్ట్ ఐదో రోజుకు చేరింది. జాకబ్ బెతెల్ (142 బ్యాటింగ్) తొలి టెస్ట్ శతకం సాధించడంతో..ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో నాలుగో రోజు ఆఖరికి 302/8 స్కోరు చేసింది. దాంతో 183 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటును పూడ్చుకున్న పర్యాటక జట్టు కేవలం 119 పరుగుల ఆధిక్యంలో నిలిచి కష్టాల్లో పడింది. పార్ట్‌టైమ్ స్పిన్నర్ బ్యూ వెబ్‌స్టర్ మూడు, బోలాండ్ రెండు వికెట్లు పడగొట్టారు. అంతకుముందు ఓవర్ నైట్ 518/7 స్కోరుతో బుధవారం మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆస్ట్రేలియా 567 పరుగులకు ఆలౌటైంది. లోయరార్డర్ బ్యాటర్ బ్యూ వెబ్‌స్టర్ (71 నాటౌట్) హాఫ్ సెంచరీ చేశాడు. టంగ్, కార్స్ చెరో మూడు, స్టోక్స్ రెండు వికెట్లు తీశారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులు సాధించింది.
ఇవీ చదవండి:
కలిసి ఎనిమిది ఎన్నికల్లో పోటీ చేశాం.. డీఎంకేతో పొత్తుపై కాంగ్రెస్
కాంగ్రెస్, ఏఐఎంఐఎంతో బీజేపీ పొత్తు.. నిప్పులు చెరిగిన ఫడ్నవిస్