Share News

సెమీస్‌కు సబలెంక

ABN , Publish Date - Sep 09 , 2026 | 04:56 AM

మహిళల డిఫెండింగ్‌ చాంపియన్‌ అరియానా సబలెంక యూఎస్‌ ఓపెన్‌లో హ్యాట్రిక్‌ టైటిల్‌ సాధించేందుకు రెండడుగుల దూరంలో..

సెమీస్‌కు సబలెంక

యూఎస్‌ ఓపెన్‌

  • క్వార్టర్స్‌లో నొస్కోవాపై గెలుపు

న్యూయార్క్‌: మహిళల డిఫెండింగ్‌ చాంపియన్‌ అరియానా సబలెంక యూఎస్‌ ఓపెన్‌లో హ్యాట్రిక్‌ టైటిల్‌ సాధించేందుకు రెండడుగుల దూరంలో నిలిచింది. బెలారస్‌కు చెందిన ఈ టాప్‌ సీడ్‌ సెమీఫైనల్‌కు చేరుకొంది. మంగళవారం హోరాహోరీగా సాగిన సింగిల్స్‌ క్వార్టర్స్‌లో ప్రపంచ నెంబర్‌వన్‌ సబలెంక 7-6 (7-1), 3-6, 7-6 (10-7)తో వింబుల్డన్‌ చాంప్‌ లిండా నొస్కోవా (చెక్‌ రిపబ్లిక్‌)పై పోరాడి గెలిచింది. కాగా, పురుషుల టాప్‌సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌, కజకిస్థాన్‌ భామ ఎలెనా రిబకినా, నాలుగో సీడ్‌ కొకొ గాఫ్‌ క్వార్టర్స్‌కు దూసుకెళ్లారు. ప్రీక్వార్టర్స్‌లో రెండో సీడ్‌ రిబకినా 6-1, 6-4తో జపాన్‌ స్టార్‌ నవోమి ఒసాకపై, అమెరికా సంచలనం కొకొ గాఫ్‌ 6-1, 6-4తో తన దేశానికే చెందిన 14వ సీడ్‌ ఇవా జోవిచ్‌పై అలవోకగా విజయం సాధించారు. క్వార్టర్‌ఫైనల్స్‌లో క్విన్‌వెన్‌ జంగ్‌ (చైనా)తో రిబకినా, ఐదో సీడ్‌ మిర్రా ఆండ్రీవ (రష్యా)తో గాఫ్‌ అమీతుమీ తేల్చుకోనున్నారు. పురుషుల సింగిల్స్‌ ప్రీక్వార్టర్స్‌లో జర్మన్‌ స్టార్‌ జ్వెరెవ్‌ 6-2, 6-2, 7-6(3)తో లూసియానో డర్డేరి (ఇటలీ)పై అలవోకగా గెలుపొందాడు. మిగతా మ్యాచుల్లో కారెన్‌ కచనోవ్‌ (రష్యా) 7-5, 4-6, 6-7(6), 6-1, 6-4తో 14వ సీడ్‌ లెర్నర్‌ టయన్‌ (అమెరికా)పై, నెదర్లాండ్స్‌ ఆటగాడు బోటిక్‌ వాన్‌ డి జాండ్‌షుల్ప్‌ 3-6, 6-7(0), 7-6(7), 7-6(3), 6-4తో ఆర్థర్‌ గి (ఫ్రాన్స్‌)పై ఐదుసెట్లపాటు పోరాడి నెగ్గారు.

ఇవి కూడా చదవండి:

గిల్‌పై ప్రతీకారం తీర్చుకున్న అభిషేక్ శర్మ.. వీడియో వైరల్!

అఫ్గానిస్థాన్‌తో టీ20 సిరీస్.. వాషింగ్టన్ సుందర్ ఫిట్

Updated Date - Sep 09 , 2026 | 04:57 AM