తన వల్లే నేనిలా..
ABN , Publish Date - Mar 12 , 2026 | 05:33 AM
ప్రపంచ టెన్నిస్ నెంబర్‌వన్ క్రీడాకారిణి అరియానా సబలెంక తన జట్టులోకి కొత్త భాగస్వామిని చేర్చుకుంది. తన వల్ల ఎంతో ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉండగల్గుతున్నానని...
కాలిఫోర్నియా: ప్రపంచ టెన్నిస్ నెంబర్‌వన్ క్రీడాకారిణి అరియానా సబలెంక తన జట్టులోకి కొత్త భాగస్వామిని చేర్చుకుంది. తన వల్ల ఎంతో ప్రశాంతంగా, ఉల్లాసంగా ఉండగల్గుతున్నానని ఈ బెలారస్ భామ చెప్పుకొచ్చింది. ఆ కొత్త భాగస్వామి ఎవరో కాదు.. తాను కొత్తగా తెచ్చుకున్న కుక్కపిల్ల. దాని పేరు యాష్. ప్రస్తుతం ఇక్కడ జరుగుతున్న ఇండియన్ వెల్స్ టోర్నీకి యాష్‌ను వెంటబెట్టుకొచ్చిన సబలెంక.. తనతో విరామసమయంలో ఆడుకుంటానని తెలిపింది. యాష్ వచ్చాక తనలో ఎంతో మార్పు కనిపిస్తోందన్న సబలెంక.. తనవల్ల చాలావరకు కోపాన్ని కూడా తగ్గించుకోగలిగానంది. అమెరికా టెన్నిస్ దిగ్గజం ఆర్థర్ ఆషెపై ఉన్న గౌరవంకొద్దీ కుక్కపిల్లకు యాష్ అని పేరు పెట్టుకున్నానని సబలెంక తెలిపింది.
ఇవి కూడా చదవండి:
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్: అగ్రస్థానంలోనే అభిషేక్ శర్మ.. సత్తా చాటిన ఇషాన్ కిషన్
టీమిండియా కష్టాన్ని తక్కువ చేయొద్దు.. కీర్తి ఆజాద్‌పై వ్యాఖ్యలపై గంభీర్ కౌంటర్