Tata Steel Blitz: ఆనంద్‌కు అర్జున్ షాక్
ABN , Publish Date - Jan 11 , 2026 | 05:20 AM
టాటా స్టీల్ చెస్ టోర్నీలో భాగంగా శనివారం మొదలైన బ్లిట్జ్ పోటీల్లో తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి తెలుగు ఆటగాడు అర్జున్ ఇరిగేసి ఐదు పాయింట్లతో...
కోల్‌కతా: టాటా స్టీల్ చెస్ టోర్నీలో భాగంగా శనివారం మొదలైన బ్లిట్జ్ పోటీల్లో తొమ్మిది రౌండ్లు ముగిసేసరికి తెలుగు ఆటగాడు అర్జున్ ఇరిగేసి ఐదు పాయింట్లతో మూడోస్థానంలో నిలిచాడు. తొలి రెండు రౌండ్లలో ఓడిన అర్జున్ మూడో రౌండ్‌లో ర్యాపిడ్ విజేత నిహాల్ సరీన్‌పై, నాలుగో రౌండ్‌లో విశ్వనాథన్ ఆనంద్‌పై గెలవడం విశేషం. నిహాల్ 6.5 పాయింట్లతో టాప్‌లో ఉండగా, ఆనంద్ ఆరు పాయింట్లతో ద్వితీయ స్థానంలో కొనసాగుతున్నాడు. మహిళల బ్లిట్జ్‌లో హారిక నాలుగు పాయింట్లతో ఏడో స్థానంలో ఉంది.
ఇవి కూడా చదవండి:
సునామీని తలపించిన సూర్యవంశీ బ్యాటింగ్
కెమెరామెన్‌పై స్మృతి మందాన అసహనం.. వీడియో వైరల్