Tata Steel Chess 2026: రెండో రౌండ్‌లో అర్జున్‌కు డ్రా
ABN , Publish Date - Jan 19 , 2026 | 02:59 AM
టాటా మాస్టర్స్ చెస్‌లో అర్జున్ ఇరిగేసి రెండో రౌండ్‌ను డ్రాగా ముగించాడు. ఆదివారం జరిగిన గేమ్‌లో తాయ్ గుయెన్ (చెక్)తో...
విజ్క్ ఆన్ జీ (నెదర్లాండ్స్): టాటా మాస్టర్స్ చెస్‌లో అర్జున్ ఇరిగేసి రెండో రౌండ్‌ను డ్రాగా ముగించాడు. ఆదివారం జరిగిన గేమ్‌లో తాయ్ గుయెన్ (చెక్)తో అర్జున్ పాయింట్ పంచుకున్నాడు. అంతకుముందు తొలి రౌండ్‌లో సహచరుడు ప్రజ్ఞానందపై అర్జున్ గెలిచాడు. రెండో రౌండ్ తర్వాత అర్జున్ 1.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక జోర్డెన్ (నెదర్లాండ్స్)తో గుకేశ్, యాగిజ్ (టర్కీ)తో అరవింద్ డ్రా చేసుకోగా, నోదిర్బెక్‌తో గేమ్‌ను ప్రజ్ఞానంద ఓడిపోయాడు.
ఇవి కూడా చదవండి..
మిచెల్‌ను మైదానం నుంచి బయటకు నెట్టిన కోహ్లీ.. ఫన్నీ వీడియో వైరల్
అథర్వ తైడే సెంచరీ.. సౌరాష్ట్ర లక్ష్యం 318