Tata Steel Masters Chess 2026: ‘టాటా మాస్టర్స్’ బరిలో అర్జున్
ABN , Publish Date - Jan 17 , 2026 | 05:00 AM
ఇటీవలే టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నీలో తలపడ్డ భారత గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేసి అర్జున్, గుకేష్, ప్రజ్ఞానంద, అరవింద్ చిదంబరం..
విజ్క్ ఆన్ జీ (నెదర్లాండ్స్): ఇటీవలే టాటా స్టీల్ చెస్ ఇండియా టోర్నీలో తలపడ్డ భారత గ్రాండ్‌మాస్టర్లు ఇరిగేసి అర్జున్, గుకేష్, ప్రజ్ఞానంద, అరవింద్ చిదంబరం.. శనివారం నుంచి జరిగే ప్రతిష్టాత్మక టాటా స్టీల్ మాస్టర్స్ చెస్ ఈవెంట్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. చెస్‌లో అత్యంత పురాతనమైన ఈ టోర్నీలో అర్జున్ టాప్‌సీడ్‌గా తలపడుతున్నాడు. వరల్డ్‌కప్ విజేత జావోఖిర్ సిందరోవ్ (ఉజ్భెకిస్థాన్)తో గుకేష్, ప్రజ్ఞానందతో అర్జున్, బ్లూబౌమ్ (జర్మనీ)తో అరవింద్ తొలిరౌండ్ ఆడనున్నారు.
ఇవి కూడా చదవండి:
రిటైర్డ్ ఔట్, రిటైర్డ్ హర్ట్ తేడా ఏంటంటే?
బుమ్రా కుమారుడి సూపర్ బౌలింగ్.. వీడియో వైరల్