మెస్సీ మాయ చేసేనా?
ABN , Publish Date - Jul 12 , 2026 | 03:24 AM
విజయాలకన్నా వివాదాల్లో ఎక్కువగా నిలుస్తున్న డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా మరో కీలక సమరానికి సిద్ధమైంది...
నేడు స్విట్జర్లాండ్‌తో
అర్జెంటీనా క్వార్టర్స్
ఉదయం 6.30 నుంచి యునైటెడ్ 8లో
కన్సాస్ సిటీ: విజయాలకన్నా వివాదాల్లో ఎక్కువగా నిలుస్తున్న డిఫెండింగ్ చాంపియన్ అర్జెంటీనా మరో కీలక సమరానికి సిద్ధమైంది. ఆదివారం ఉదయం జరిగే ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్స్‌లో స్విట్జర్లాండ్‌ను ఎదుర్కోనుంది. కెప్టెన్ లియోనెల్ మెస్సీ అసాధారణ ఆటతీరుతో ఇప్పటికే అర్జెంటీనా టైటిల్ పోటీదారులను వెనక్కినెట్టింది. కానీ నాకౌట్ దశలో తమకన్నా బలహీన జట్లు అయిన కేప్‌వెర్డె, ఈజిప్టుల నుంచి గట్టి పోటీ ఎదుర్కొని గట్టెక్కింది. దీంతో నిజంగానే ఈ జట్టు టైటిల్‌ను నిలబెట్టుకుంటుందా? అనే సందేహాలను లేవనెత్తింది. ఇప్పుడు రెండుసార్లు చాంపియన్‌గా నిలిచిన స్విస్ ప్రత్యర్థి కానుండడంతో అర్జెంటీనాకు సిసలైన సవాల్ ఎదురుకానుంది.
ఇవీ చదవండి:
స్టోక్స్ రిటైర్మెంట్ వీడియోపై రచ్చ.. ఈసీబీకి ఐసీసీ క్లీన్ చిట్!
ఆ ఫొటోలు చూసి కోహ్లీ షాకైపోయాడు: ఇంగ్లండ్ బ్యాటర్ జార్డన్ కాక్స్