అతనొచ్చాడు.. ఓడారు!
ABN , Publish Date - Jul 21 , 2026 | 05:02 AM
స్లొవేనియాకు చెందిన ప్రముఖ రెఫరీ స్లావ్‌కో విన్సిచ్‌ను ఫైనల్ మ్యాచ్‌కు అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తాడని ఫిఫా ప్రకటించిన వెంటనే అర్జెంటీనా అభిమానులంతా..
స్లొవేనియాకు చెందిన ప్రముఖ రెఫరీ స్లావ్‌కో విన్సిచ్‌ను ఫైనల్ మ్యాచ్‌కు అధికారిగా బాధ్యతలు నిర్వర్తిస్తాడని ఫిఫా ప్రకటించిన వెంటనే అర్జెంటీనా అభిమానులంతా గొల్లుమన్నారు. అతనొస్తే తమకు ఓటమి ఖాయమని గొంతెత్తారు. ఇప్పుడు సరిగ్గా అదే జరిగిందా..? అంటే.. ఏమో, ఈ సెంటిమెంట్ నిజమైందని అర్జెంటీనా ఓటమి తర్వాత చాలామంది అనుకుంటున్నారు. నాలుగేళ్ల క్రితం ఖతార్‌లో జరిగిన టోర్నీ లీగ్ దశలో అర్జెంటీనా 0-1తో సౌదీ అరేబియా చేతిలో ఓటమిపాలైంది. ఆ మ్యాచ్‌కు విన్సిచ్ రెఫరీగా వ్యవహరించాడు. ఇప్పుడు తాజా ఫైనల్‌కు కూడా విన్సిచ్ రెఫరీగా రావడంతో ‘అతనొచ్చాడు.. మేం ఓడాం’ అని అర్జెంటీనావాసులు మొత్తుకుంటున్నారు. వాళ్లకు సెంటిమెంట్లు ఎక్కువ. తాను మ్యాచ్‌కు హాజరైతే తమ జట్టు ఓడుతుందన్న భయంతోనే ఫైనల్‌కు రావడం లేదని ఏకంగా అర్జెంటీనా అధ్యక్షుడే రెండ్రోజుల క్రితం ప్రకటించారు. ఇప్పుడు రెఫరీ విషయంలోనూ సెంటిమెంట్ పునరావృతమైందన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో కొత్త కోర్సులకు గ్రీన్ సిగ్నల్
మరో రెండు వారాలు క్షేత్రస్థాయి పర్యటనలకు దూరంగా డిప్యూటీ సీఎం పవన్..