Share News

Vijay Hazare Trophy: మ్యాచ్‌ టై ఆంధ్రతో హరియాణా

ABN , Publish Date - Jan 07 , 2026 | 05:36 AM

ఆంధ్ర ఓపెనర్‌ సీఆర్‌ జ్ఞానేశ్వర్‌ (142 నాటౌట్‌) అజేయ శతకంతో రాణించగా.. హరియాణాతో జరిగిన వన్డే మ్యాచ్‌ టైగా ముగిసింది. విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా...

Vijay Hazare Trophy: మ్యాచ్‌ టై ఆంధ్రతో హరియాణా

  • జ్ఞానేశ్వర్‌ అజేయ శతకం

  • రాజుకు 5 వికెట్లు

ఆలూర్‌ (కర్ణాటక): ఆంధ్ర ఓపెనర్‌ సీఆర్‌ జ్ఞానేశ్వర్‌ (142 నాటౌట్‌) అజేయ శతకంతో రాణించగా.. హరియాణాతో జరిగిన వన్డే మ్యాచ్‌ టైగా ముగిసింది. విజయ్‌ హజారే ట్రోఫీలో భాగంగా మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హరియాణా 49.5 ఓవర్లలో 324 పరుగుల భారీ స్కోరు సాధించింది. హిమాన్షు రాణా (112) శతకం, మయాంక్‌ శాండిల్య (75) అర్ధసెంచరీ సాధించారు. సత్యనారాయణ రాజుకు ఐదు, రామ్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత వెలుతురులేమి కారణంగా వీజేడీ పద్దతిన ఆంధ్ర ఛేదనను 48 ఓవర్లలో 308 పరుగులుగా నిర్ణయించారు. దీంతో ఓపెనర్లు జ్ఞానేశ్వర్‌-కేఎస్‌ భరత్‌ (70) చెలరేగి తొలి వికెట్‌కు 138 పరుగులు జత చేశారు. చివరి బంతికి స్కోరు 307 పరుగులు కావడంతో మ్యాచ్‌ టైగా ముగిసింది. అన్షుల్‌కు మూడు, సమంత్‌కు రెండు వికెట్లు దక్కాయి.

ఇవి కూడా చదవండి:

విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాదీ ప్లేయర్ డబుల్ సెంచరీ..

బీసీసీఐకి మరో కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయిన బంగ్లాదేశ్

Updated Date - Jan 07 , 2026 | 05:36 AM