Share News

15 నుంచి ఆంధ్ర పికిల్‌బాల్‌ లీగ్‌

ABN , Publish Date - Jul 23 , 2026 | 02:18 AM

ఆంధ్ర పికిల్‌బాల్‌ లీగ్‌ను ఆగస్టు 15 నుంచి నిర్వహించనున్నారు. లీగ్‌లో పాల్గొనే జట్లకు సంబంధించి ఆటగాళ్ల వేలం...

15 నుంచి ఆంధ్ర పికిల్‌బాల్‌ లీగ్‌

విశాఖపట్నం స్పోర్ట్స్‌ (ఆంధ్రజ్యోతి): ఆంధ్ర పికిల్‌బాల్‌ లీగ్‌ను ఆగస్టు 15 నుంచి నిర్వహించనున్నారు. లీగ్‌లో పాల్గొనే జట్లకు సంబంధించి ఆటగాళ్ల వేలం గురువారం జరుగుతుంది. విశాఖపట్నం, విజయవాడ వేదికలుగా ఆగస్టు 23 వరకు జరగనున్న ఈ టోర్నీలో 8 జట్లు పాల్గొంటాయని చీఫ్‌ ప్యాట్రన్‌ సుజయ్‌ కృష్ణ రంగారావు బుధవారం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తెలిపారు. ముగ్గురు మహిళలు, ఎనిమిది మంది పురుషులు ఒక జట్టుగా ఏర్పడతారని, జట్టు సభ్యులను కొనుగోలు చేసుకునేందుకు ఒక్కొక్క ఫ్రాంచైజీ రూ.11 లక్షలు వెచ్చించవచ్చునన్నారు. టోర్నీ ప్రారంభోత్సవ వేడుక విజయవాడలో, ముగింపు కార్యక్రమం విశాఖలోని గీతం యూనివర్సిటీలో జరుగుతాయని చెప్పారు.

Also Read:

కౌంటీ ఛాంపియన్‌షిప్: యార్క్‌షైర్‌తో కుల్‌దీప్ యాదవ్ ఒప్పందం

గిద్దలూరు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి

Updated Date - Jul 23 , 2026 | 02:18 AM