Share News

ఆంధ్రా పికిల్‌ బాల్‌ లీగ్‌ ప్రారంభం

ABN , Publish Date - Aug 16 , 2026 | 05:47 AM

రాష్ట్రంలో పికిల్‌బాల్‌కు ఆదరణ పెంచడంతో పాటు ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు మెరుగైన వేదిక కల్పించడమే ఆంధ్రా పికిల్‌బాల్‌ లీగ్‌ (ఏపీఎల్‌) లక్ష్యమని...

ఆంధ్రా పికిల్‌ బాల్‌ లీగ్‌ ప్రారంభం

విజయవాడ (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పికిల్‌బాల్‌కు ఆదరణ పెంచడంతో పాటు ప్రతిభావంతులైన యువ క్రీడాకారులకు మెరుగైన వేదిక కల్పించడమే ఆంధ్రా పికిల్‌బాల్‌ లీగ్‌ (ఏపీఎల్‌) లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. ఇక్కడి నైట్రో పికిల్‌ కెఫేలో శనివారం ఏపీఎల్‌ మొదలైంది. రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌, ఏపీఎల్‌ చైర్మన్‌, చీఫ్‌ ప్యాట్రన్‌ సుజయ్‌ కృష్ణ రంగారావు లీగ్‌ను ప్రారంభించారు. మొత్తం 8జట్లు గోదావరి సెలెస్టియల్స్‌, అమరావతి ఫోనిక్స్‌, తిరుపతి టైగర్స్‌, నెల్లూరు నింజాస్‌, వైజాగ్‌ సీ హాక్స్‌, రాయల్స్‌ ఆఫ్‌ రాయలసీమ, భీమవరం బుల్స్‌, విజయవాడ సన్‌షైనర్స్‌ లీగ్‌లో పోటీపడుతున్నాయి. 88 మంది ఆటగాళ్లను ప్రాంచైజీలు దక్కించుకున్నాయి. ఈనెల 23 వరకు లీగ్‌ మ్యాచ్‌లు జరగనున్నాయి. ఫైనల్‌ను విశాఖపట్నంలోని గీతం యూనివర్సిటీలో నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.

ఇవి కూడా చదవండి..

బెంగళూరులో బెంగాల్ యువకుడి అరెస్ట్.. ఉగ్రసంస్థల లింకులతో దర్యాప్తు..

అరుణాచల్‌ప్రదేశ్‌లో వరద బీభత్సం.. నలుగురి మృతి, ఆర్మీ సిబ్బంది గల్లంతు..

Updated Date - Aug 16 , 2026 | 05:47 AM