ఆంధ్ర పారా అథ్లెట్ల సత్తా
ABN , Publish Date - May 29 , 2026 | 01:12 AM
బెంగళూరులో ముగిసిన ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్స్ పోటీల్లో ఆఖరి రోజు ఆంధ్ర ఏడు పతకాలు...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): బెంగళూరులో ముగిసిన ఇండియన్ ఓపెన్ ఇంటర్నేషనల్ పారా అథ్లెటిక్స్ పోటీల్లో ఆఖరి రోజు ఆంధ్ర ఏడు పతకాలు సాధించింది. ఎఫ్40 షాట్‌పుట్‌లో రవి (విశాఖపట్నం) స్వర్ణం, టి11, 200మీ.లో కె.లలిత స్వర్ణం, వి.రవన్ని రజతం, టి12 లాంగ్‌జం్‌పలో గౌతం రజతం, ఎఫ్41 షాట్‌పుట్‌లో బాషా రజతం, ఎఫ్51 డిస్కస్ త్రో లో రాము కాంస్యం, టి46, 200 మీటర్ల పరుగులో వి.భవాని కాంస్యాలు కొల్లగొట్టారు. ఈ పోటీల్లో ఆంధ్ర పా రా అథ్లెట్లు 15 పతకాలు సాధించడం విశేషం.
ఇవి కూడా చదవండి:
కేన్ విలియమన్స్ వరల్డ్ రికార్డ్
వైభవ్‌కు బౌలింగ్ చేయడం అంత ఈజీ కాదు: ప్యాట్ కమిన్స్