Share News

మహిళల క్రికెట్‌లోకి అనయను ఎలా అనుమతిస్తారు?

ABN , Publish Date - Aug 29 , 2026 | 03:21 AM

అనయ బంగర్‌.. టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ బంగర్‌ కుమార్తె. అబ్బాయిగా జన్మించినా, ఇటీవలే లింగ మార్పిడి చేయించుకొని అమ్మాయిగా మారింది. గతంలో...

మహిళల క్రికెట్‌లోకి అనయను ఎలా అనుమతిస్తారు?

మండిపడ్డ సఫారీ ఆల్‌రౌండర్‌ కాప్‌

న్యూఢిల్లీ: అనయ బంగర్‌.. టీమిండియా మాజీ క్రికెటర్‌ సంజయ్‌ బంగర్‌ కుమార్తె. అబ్బాయిగా జన్మించినా, ఇటీవలే లింగ మార్పిడి చేయించుకొని అమ్మాయిగా మారింది. గతంలో అభిషేక్‌ శర్మ, సర్ఫరాజ్‌ ఖాన్‌తదితరులతో కలిసి దేశవాళీల్లో ఆడిన అనయ.. ఇప్పుడు మహిళగా మారాక కూడా క్రికెట్‌ ఆడాలనుకొని క్రికెట్‌ ఆస్ట్రేలియా (సీఏ)ను సంప్రదించింది. దీంతో ఆమెను తమ దేశంలో క్లబ్‌ స్థాయి క్రికెట్‌ ఆడేందుకు సీఏ ఒప్పుకొంది. అయితే, సీఏ తీసుకున్న నిర్ణయంపై దక్షిణాఫ్రికా మహిళల జట్టు స్టార్‌ ఆల్‌రౌండర్‌ మారిజానె కాప్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. ట్రాన్స్‌జెండర్‌ను మహిళల క్రికెట్‌లో ఆడేందుకు ఎలా అనుమతిస్తారంటూ మండిపడింది. ‘అనయ ట్రాన్స్‌జెండర్‌. ఆమెను మహిళల క్రికెట్‌లో ఎలా ఆడిస్తారు? ఇది హాస్యాస్పదంగా ఉంది’ అని కాప్‌ తన సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసింది.

ఇవి కూడా చదవండి:

టెస్టు క్రికెట్‌కు అవే ముఖ్యం.. శ్రీలంక సిరీస్‌పై గంభీర్ స్పందనిదే!

అనయ బంగర్‌ను ఆడించొద్దు.. సౌతాఫ్రికా క్రికెటర్ కాప్ తీవ్ర విమర్శలు

Updated Date - Aug 29 , 2026 | 03:21 AM