స్క్వాష్ ఫైనల్లో అనహత్
ABN , Publish Date - Mar 22 , 2026 | 05:55 AM
భారత యువ సంచలనం అనహత్ సింగ్ ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్‌లో సింగిల్స్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది...
ముంబై: భారత యువ సంచలనం అనహత్ సింగ్ ఇండియన్ ఓపెన్ స్క్వాష్ టోర్నమెంట్‌లో సింగిల్స్ టైటిల్‌కు అడుగు దూరంలో నిలిచింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో టాప్‌సీడ్ అనహత్ 3-1తో భారత్‌కే చెందిన తన్వీ ఖన్నాను ఓడించింది. ఆదివారం జరిగే తుదిపోరులో హనా మోతాజ్ (ఈజిప్టు)తో అనహత్ తలపడనుంది. పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాళ్ల మఽధ్య ఫైనల్ జరగనుంది. సెమీఫైనల్స్‌లో వీర్ చోత్రాని 3-1తో సహచరుడు సంజయ్ జీవాపై, అభయ్ సింగ్ 3-1తో అమీషెన్‌రాజ్ చంద్రన్ (మలేసియా)పై గెలిచి టైటిల్‌ఫైట్‌కు సిద్ధమయ్యారు.
ఇవి కూడా చదవండి:
అతడి స్థాయిని ఎవరూ భర్తీ చేయలేరు: కె. శ్రీకాంత్
రామ జన్మభూమిని దర్శించిన ఎల్ఎస్జీ ఓనర్ సంజీవ్, కెప్టెన్ పంత్..