Share News

అమర్‌సింగ్‌ జాతీయ రికార్డు

ABN , Publish Date - Nov 17 , 2026 | 02:47 AM

హైదరాబాద్‌ రన్నర్స్‌ సొసైటీ (హెచ్‌ఆర్‌ఎస్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరో ఎడిషన్‌ స్టేడియం రన్‌లో...

అమర్‌సింగ్‌ జాతీయ రికార్డు

హైదరాబాద్‌ సిటీ (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్‌ రన్నర్స్‌ సొసైటీ (హెచ్‌ఆర్‌ఎస్‌) ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరో ఎడిషన్‌ స్టేడియం రన్‌లో అమర్‌సింగ్‌ దేవాండ జాతీయ రికార్డు సృష్టించాడు. 12 గంటల స్టేడియం రన్‌లో భాగంగా అమర్‌సింగ్‌ 389 ల్యాప్‌లను పూర్తిచేశాడు. దీంతో ఆయన పరిగెత్తిన మొత్తం దూరం 155.6 కిలో మీటర్లుగా నమోదైంది. ఈ క్రమంలో గతేడాది బెంగళూరులో తానే నమోదు చేసిన 12 గంటల్లో 151.6 కి,మీ దూరం రికార్డును అమర్‌ అధిగమించాడు. ఇక, మురళీకృష్ణ నిరంతరాయంగా 24 గంటలపాటు వెనక్కి పరిగెడుతూ (బ్యాక్‌వర్డ్‌ రన్నింగ్‌) గిన్నిస్‌ రికార్డు సాధించేందుకు ప్రయత్నించడం ఈ పోటీల్లో విశేషం. ఇక, 24 గంటల సోలో రన్‌ పురుషుల్లో విజయేందర్‌, మహిళల్లో ఆదిత్య దేవి విజేతలుగా నిలిచారు.

ఇవి కూడా చదవండి:

ఐసీసీ ఛైర్మన్‌గా జై షా పునర్నియామకం

ధోనీని గుర్తు చేశాడు.. మోహిత్ ఉల్వాపై సునీల్ గావస్కర్ ప్రశంసల వర్షం

Updated Date - Nov 17 , 2026 | 02:48 AM