Hazare Trophy 2026: అమన్ డబుల్
ABN , Publish Date - Jan 07 , 2026 | 05:50 AM
హైదరాబాదీ బ్యాటర్ అమన్ రావు (154 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్సర్లతో 200 నాటౌట్) అజేయ డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. దీంతో విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా...
బెంగాల్‌పై హైదరాబాద్ విజయం
విజయ్ హజారే ట్రోఫీ
రాజ్‌కోట్: హైదరాబాదీ బ్యాటర్ అమన్ రావు (154 బంతుల్లో 12 ఫోర్లు, 13 సిక్సర్లతో 200 నాటౌట్) అజేయ డబుల్ సెంచరీతో చరిత్ర సృష్టించాడు. దీంతో విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా మంగళవారం బెంగాల్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 107 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. కరీంనగర్‌కు చెందిన అమన్‌కు ఇది కేవలం మూడో లిస్ట్-ఎ మ్యాచ్ కాగా, హైదరాబాద్ తరఫున ఈ ఫార్మాట్‌లో డబుల్ బాదిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన హైదరాబాద్ అమన్ ధాటికి 50 ఓవర్లలో 352/5 స్కోరు సాధించింది. రాహుల్ సింగ్ (65), తిలక్ (34) రాణించారు. ఓపెనర్‌గా బరిలోకి దిగిన అమన్ 108 బంతుల్లో సెంచరీ సాధించగా.. మరో శతకం కేవలం 46 బంతుల్లోనే పూర్తి చేశాడు. ఈక్రమంలో తను ఇన్నింగ్స్ చివరి బంతికి సిక్సర్ బాది అజేయ డబుల్ సెంచరీని పూర్తి చేయడం విశేషం. అలాగే షమి, ముకేశ్, ఆకాశ్ దీప్, షాబాజ్ అహ్మద్ ఓవర్లలో చెలరేగిన అమన్ 120 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత బెంగాల్ ఛేదనలో పేసర్ సిరాజ్ (4/58) ధాటికి 44.4 ఓవర్లలో 245 పరుగులకు పరిమితమైంది. షాబాజ్ అహ్మద్ (108 నాటౌట్) మాత్రమే రాణించాడు.
ఇవి కూడా చదవండి:
విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాదీ ప్లేయర్ డబుల్ సెంచరీ..
బీసీసీఐకి మరో కౌంటర్ ఇచ్చేందుకు రెడీ అయిన బంగ్లాదేశ్