జ్వెరెవ్ సాధించెన్
ABN , Publish Date - Jun 08 , 2026 | 03:08 AM
అలెగ్జాండర్ జ్వెరెవ్ సాధించాడు.. తొలి గ్రాండ్‌స్లామ్ కోసం ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న ఈ జర్మనీ టెన్నిస్ స్టార్ ఎట్టకేలకు తన కల సాకారం చేసుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో...
ఫ్రెంచ్ ఓపెన్‌తో కెరీర్‌లో తొలి గ్రాండ్‌స్లామ్ కైవసం
పారిస్: అలెగ్జాండర్ జ్వెరెవ్ సాధించాడు.. తొలి గ్రాండ్‌స్లామ్ కోసం ఎన్నాళ్లుగానో వేచి చూస్తున్న ఈ జర్మనీ టెన్నిస్ స్టార్ ఎట్టకేలకు తన కల సాకారం చేసుకున్నాడు. ఫ్రెంచ్ ఓపెన్‌లో అల్కారజ్, సినర్, జొకోవిచ్‌ల అడ్డు లేకుండా ఫైనల్ చేరిన ఈ వరల్డ్ నెంబర్ టూ ఆటగాడు అందివచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ చివరకు విజేతగా నిలిచాడు. ఆదివారం ఇక్కడ జరిగిన పురుషుల సింగిల్స్ రెండోసీడ్ జ్వెరెవ్ 6-1, 4-6, 6-4, 6-7(5-7), 6-1తో 10వ సీడ్ ఫ్లావియో కొబొల్లీ (ఇటలీ)పై ఐదుసెట్లపాటు పోరాడి గెలిచాడు. 29ఏళ్ల జ్వెరెవ్ నాలుగో ప్రయత్నంలో గ్రాండ్‌స్లామ్ ఫైనల్ నెగ్గడం విశేషం. తొలిసారిగా 2020లో యూఎస్ ఓపెన్ ఫైనల్ చేరిన జ్వెరెవ్.. డొమినిక్ థీమ్ చేతిలో ఓడి రన్నర్‌పగా నిలిచాడు. ఆ తర్వాత 2024లో ఫ్రెంచ్ ఓపెన్ తుదిపోరులో నిలిచినా, అల్కారజ్‌కు ట్రోఫీ కోల్పోయాడు. నిరుడు ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో జానిక్ సినర్‌కు టైటిల్ చేజార్చుకున్న జ్వెరెవ్..ఈసారి మట్టికోర్టులో మాత్రం పాగా వేశాడు. ఇక, 4 గంటల 16 నిమిషాలపాటు సాగిన టైటిల్ పోరు రసవత్తరంగా సాగింది. తొలి సెట్‌ను బ్రేక్ పాయింట్‌తో ఆరంభించిన జ్వెరెవ్.. పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. మరో రెండుసార్లు ఫ్లావియో కొబొల్లీ సర్వీ్‌సను బ్రేక్ చేసిన జ్వెరెవ్ సెట్‌ను సొంతం చేశాడు. అయితే, రెండో సెట్‌లో ఫ్లావియో పుంజుకొన్నాడు. 3-3తో ఉన్న సమయంలో.. ప్రత్యర్థి సర్వీ్‌సను బ్రేక్ చేసిన కొబొల్లీ సర్వీ్‌సలను నిలబెట్టుకొంటూ సమం చేశాడు. మూడో సెట్‌లో ఇద్దరూ సర్వీ్‌సలను నిలబెట్టుకోగా.. 10వ గేమ్‌లో జ్వెరెవ్ బ్రేక్ పాయింట్‌తో మూడో సెట్‌లో గెలిచి 2-1తో పైచేయి సాధించాడు. కానీ, నాలుగో సెట్‌లో హోరాహోరీగా పోరాడిన కొబొల్లీ 6-6తో సెట్ ఫలితాన్ని టైబ్రేక్ తీసుకెళ్లాడు. టైబ్రేక్‌లో కొబొల్లీ 7-5తో నెగ్గి నాలుగో సెట్‌ను తన ఖాతాలో వేసుకొన్నాడు. ఇక, నిర్ణాయక ఐదో సెట్‌లో జ్వెరెవ్ జోరుతో అంతా ఏకపక్షమైంది.
ఇవి కూడా చదవండి:
టీజీ 20 లీగ్: మెదక్‌కు తిలక్ వర్మ.. ఎంత ధర పలికాడంటే?
టీ20 కెప్టెన్సీపై స్పందించిన శ్రేయస్ అయ్యర్