Share News

ఫైనల్‌కు జ్వెరెవ్‌

ABN , Publish Date - Jun 06 , 2026 | 03:43 AM

జర్మనీ టెన్నిస్‌ స్టార్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు...

ఫైనల్‌కు జ్వెరెవ్‌

రేపు కొబొలితో తుదిపోరు

  • ఫ్రెంచ్‌ ఓపెన్‌

పారిస్‌: జర్మనీ టెన్నిస్‌ స్టార్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పురుషుల సింగిల్స్‌లో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. శనివారం ఇక్కడ జరిగిన సెమీఫైనల్లో రెండోసీడ్‌ జ్వెరెవ్‌ 7-5, 6-2, 3-6, 6-3తో 26వ సీడ్‌ జాకుబ్‌ మెన్సిక్‌ (చెక్‌ రిపబ్లిక్‌)ను ఓడించాడు. 29 ఏళ్ల జ్వెరెవ్‌ గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరడం ఇది నాలుగోసారి. ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రెండోసారి. రెండేళ్ల క్రితం ఇక్కడే అల్కారజ్‌ చేతిలో ఓడి రన్నరప్‌గా నిలిచాడు. ఆదివారం జరిగే తుదిపోరులో 24 ఏళ్ల ఫ్లావియో కొబొలి (ఇటలీ)తో జ్వెరెవ్‌ తలపడతాడు. మరో సెమీస్‌లో తన దేశానికే చెందిన అర్నాల్డి వాకోవర్‌ ఇవ్వడంతో కొబొలి తొలిసారి గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌ చేరాడు.

ఈ వార్తలు కూడా చదవండి

అమరావతిపై ఓర్వలేక విష ప్రచారం చేస్తున్నారు: దేవినేని ఉమామహేశ్వరరావు

పదవిగా కాదు.. బాధ్యతగా భావిస్తున్నా: లింగమనేని రమేశ్

Updated Date - Jun 06 , 2026 | 03:43 AM