Share News

జ్వెరెవ్‌ శుభారంభం

ABN , Publish Date - May 25 , 2026 | 04:22 AM

ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌, 8వ సీడ్‌ మిర్రా అండ్రీవా, 11వ సీడ్‌ బెలిండా బెన్సిక్‌ శుభారంభం చేశారు...

జ్వెరెవ్‌ శుభారంభం

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో రెండో సీడ్‌ అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌, 8వ సీడ్‌ మిర్రా అండ్రీవా, 11వ సీడ్‌ బెలిండా బెన్సిక్‌ శుభారంభం చేశారు. పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్‌లో జ్వెరెవ్‌ (జర్మనీ) 6-3, 6-4, 6-2తో బెంజమెన్‌ బోం జీపై, 13వ సీడ్‌ కారెన్‌ కచనోవ్‌ 6-3, 7-6(3), 6-0తో ఆర్థర్‌ జియాపై గెలిచి రెండో రౌండ్‌ చేరారు. మహిళల ఆరంభ రౌండ్‌లో అండ్రీవా (రష్యా) 6-3, 6-3తో స్థానిక క్రీడాకారిణి ఫియోనా ఫెర్రోను, బెన్సిక్‌ (స్విస్‌) 6-3, 6-2తో సింజా క్రీస్‌ను, హేలీ (అమెరికా) 6-7(7), 7-6(6), 6-2తో క్రెజికోవాను ఓడించారు.

ఇవి కూడా చదవండి:

అర్జున్ కోసం సారా టెండూల్కర్ ఎమోషనల్ పోస్ట్

ఐపీఎల్ చరిత్రలో తొలి బౌలర్‌గా మహమ్మద్ షమీ..

Updated Date - May 25 , 2026 | 04:22 AM