అథ్లెట్ల పాలిట ‘టెంపుల్’!
ABN , Publish Date - May 21 , 2026 | 01:33 AM
క్రీడా రంగంలో సాంకేతికత పోషిస్తున్న పాత్ర అంతా..ఇంతా కాదు. క్రికెట్‌లో అయితే ఇప్పుడు ప్రతిదీ టెక్నాలజీనే. క్రమంగా సాంకేతికత అన్ని ఆటల్లోకి ప్రవేశిస్తోంది...
న్యూఢిల్లీ: క్రీడా రంగంలో సాంకేతికత పోషిస్తున్న పాత్ర అంతా..ఇంతా కాదు. క్రికెట్‌లో అయితే ఇప్పుడు ప్రతిదీ టెక్నాలజీనే. క్రమంగా సాంకేతికత అన్ని ఆటల్లోకి ప్రవేశిస్తోంది. తాజాగా..బ్యాడ్మింటన్‌లోకీ అడుగుపెట్టింది. ఏస్ షట్లర్ పీవీ సింధు ఈ మధ్య పోటీల సమయంలోనూ, బయటా కణత వద్ద ఓ పరికరం ధరించి కనిపిస్తోంది. బెంగళూరులో ఇటీవల ఓ క్రీడా సమ్మేళనంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని కలిసిన సందర్భంలోనూ సింధు ఆ పరికరంతో కనిపించింది. దాంతో అది ఏమిటనే విషయమై ఆసక్తి ఏర్పడింది. అది కృత్రిమ మేధస్సుతో పనిచేసే ఓ చిప్. పేరు ‘టెంపుల్’. అథ్లెట్ల మెదడులో రక్తప్రసరణ ఎలా జరుగుతుందో ఆ పరికరం తెలియజేస్తుంది. క్రీడాకారుల మానసిక పరిస్థితిని గుర్తిస్తుంది. వారిలో ఒత్తిడి ఏ స్థాయిలో ఉందో విశ్లేషిస్తుంది. ఈ సమాచారం ఆధారంగా ఆటగాళ్ల శిక్షణ అంశాల్లో కోచ్‌లు కచ్చితమైన నిర్ణయాలు తీసుకోగలుగుతారు. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ జొమాటో వ్యవస్థాపకుడు దీపిందర్ గోయెల్ ఈ పరికరాన్ని అభివృద్ధి చేస్తున్నారు. ప్రస్తుతం ఇది ప్రయోగాత్మక దశలో ఉంది. అన్నీ పూర్తయి అందుబాటులోకి వస్తే అథ్లెట్లకు ‘టెంపుల్’ వరమేనని క్రీడా వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
భారత టీ20 జట్టుకు శ్రేయస్ కెప్టెన్ అవుతాడు: రికీ పాంటింగ్
లార్డ్స్ మైదానంలో తొలి టీ20 ప్రపంచ కప్ గెలుస్తాం: జెమీమా