Share News

అథ్లెట్లకు డీఎన్‌ఏ పరీక్ష

ABN , Publish Date - Apr 19 , 2026 | 04:33 AM

భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎ్‌ఫఐ) కీలక నిర్ణయం తీసుకుంది. అథ్లెట్లందరికీ డీఎన్‌ఏ పరీక్ష చేయించనుంది....

అథ్లెట్లకు డీఎన్‌ఏ పరీక్ష

న్యూఢిల్లీ: భారత అథ్లెటిక్స్‌ సమాఖ్య (ఏఎ్‌ఫఐ) కీలక నిర్ణయం తీసుకుంది. అథ్లెట్లందరికీ డీఎన్‌ఏ పరీక్ష చేయించనుంది. వచ్చేనెల రాంచీలో జరిగే ఫెడరేషన్‌ కప్‌లో ఈ పరీక్షలు నిర్వహించనుంది. తద్వారా ప్రతి అథ్లెట్‌ డేటాను సేకరించనుంది. ఆ డేటాను పరిశోధన, అభివృద్ధి, గాయాల నివారణ, నిర్దుష్ట అథ్లెట్‌ శిక్షణ పద్ధతులలో ఉపయోగించనుంది. మహిళా అథ్లెట్లకు ‘ఎస్‌ఆర్‌వై’ జన్యు పరీక్షలను నిర్వహించనుంది. మహిళల విభాగంలో.. జీవశాస్త్రపరంగా మహిళలే పోటీపడేలా చేసేందుకు ఈ పరీక్ష చేయనున్నారు.

ఇవి కూడా చదవండి:

అందుకే పీఎస్ఎల్‌లో ఆడుతున్నా: ఇంగ్లండ్ స్టార్ బౌలర్

ఇన్‌స్టా పోస్ట్‌కు కోహ్లీ లైక్.. జర్మనీ మోడల్ లిజ్లాజ్ రియాక్షన్ ఇదే!

Updated Date - Apr 19 , 2026 | 04:33 AM