అదిరే ఆరంభం
ABN , Publish Date - Jan 22 , 2026 | 05:34 AM
పొట్టి ఫార్మాట్‌లో తనకు తిరుగులేదని టీమిండియా నిరూపించింది. టీ20 వరల్డ్ కప్‌నకు సన్నాహకమైన న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఘనమైన బోణీ చేసింది. బుధవారం జరిగిన మొదటి...
డబ్ల్యూపీఎల్‌లో నేడు
గుజరాత్ X యూపీ (రా. 7.30)
అభిషేక్ సునామీ ఇన్నింగ్స్
చెలరేగిన రింకూ సింగ్
తొలి టీ20లో కివీస్ చిత్తు
48 రన్స్‌తో భారత్ విజయం
అభిషేక్ శర్మ (35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 84)
రింకూ సింగ్ (44 నాటౌట్)
నాగ్‌పూర్: పొట్టి ఫార్మాట్‌లో తనకు తిరుగులేదని టీమిండియా నిరూపించింది. టీ20 వరల్డ్ కప్‌నకు సన్నాహకమైన న్యూజిలాండ్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఘనమైన బోణీ చేసింది. బుధవారం జరిగిన మొదటి టీ20లో 48 పరుగులతో విజయం సాధించింది. మొదట భారత్ 20 ఓవర్లలో 238/7 స్కోరు చేసింది. అభిషేక్ శర్మ (35 బంతుల్లో 5 ఫోర్లు, 8 సిక్స్‌లతో 84) సునామీ ఇన్నింగ్స్ ఆడగా, రింకూ సింగ్ (20 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్స్‌లతో 44 నాటౌట్) తనదైన శైలిలో చెలరేగాడు. సూర్య కుమార్ (22 బంతుల్లో 4 ఫోర్లు, సిక్స్‌తో 32), హార్దిక్ (16 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 25) సత్తా చాటారు. డఫి, జేమిసన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. ఛేదనలో న్యూజిలాండ్ 20 ఓవర్లలో 190/7 స్కోరుకే పరిమితమై ఓడింది. గ్లెన్ ఫిలిప్స్ (40 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స్‌లతో 78), చాప్‌మన్ (24 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స్‌లతో 39) రాణించారు. శివమ్ దూబే, వరుణ్ చెరో రెండు వికెట్లు తీశారు. అభిషేక్ ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’గా నిలిచాడు.
ఫిలిప్స్ మెరుపులు: భారీ ఛేదనలో హిట్టర్లు కాన్వే (0), రచిన్ (1) విఫలమయ్యారు. కానీ రాబిన్సన్, ఫిలిప్స్ ధాటిగా ఆడడంతో పవర్ ప్లేలో కివీస్ 50/2తో నిలిచింది. తన మొదటి ఓవర్లోనే రాబిన్సన్ (21)ను అవుట్ చేసిన వరుణ్ ప్రత్యర్థికి షాకిచ్చాడు. ఈ దశలో చాప్‌మన్ జతగా ఫిలిప్స్ భారత్ బౌలర్లను వణికించి జట్టును రేస్‌లో నిలిపాడు. ఫిలి్‌ప్సను పెవిలియన్ చేర్చిన అక్షర్ భారత్‌కు ఊరటనిచ్చాడు. చాప్‌మన్‌ను వరుణ్ బలిగొన్నాడు. తర్వాత మిచెల్ (28), కెప్టెన్ శాంట్నర్ (20 నాటౌట్) భాగస్వామ్యం ఓటమి అంతరాన్ని మాత్రమే తగ్గించింది.
అభిషేక్.. ఆకాశమే హద్దుగా..: టీ20 ప్రపంచ కప్‌నకు ముందు కీలకమైన సిరీ్‌సలో తమకు అందివచ్చిన తొలి అవకాశాన్ని సంజూ శాంసన్, ఇషాన్ కిషన్ సద్వినియోగం చేసుకోలేక పోయారు. అయితే అభిషేక్ ఎడాపెడా షాట్లతో బౌలర్లను బెంబేలెత్తించగా, ఆపై రింకూ తనదైన శైలిలో విజృంభించడంతో భారత్ భారీస్కోరు చేసింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ చివరి బంతికి సిక్స్‌తో అభిషేక్ సునామీ ఇన్నింగ్స్‌కు తెరతీయగా జేమిసన్ వేసిన రెండో ఓవర్‌లో 4,4తో సంజూ బ్యాట్ ఝళిపించాడు. కానీ ఇదే ఓవర్‌లో సంజూ (10)ను జేమిసన్ క్యాచవుట్ చేయగా, తదుపరి ఓవర్లో కిషన్ (8)ను డఫీ పెవిలియన్ చేర్చాడు. దాంతో 27/2తో భారత్ కష్టాల్లో పడింది. చాలాకాలంగా ఫామ్‌లేమితో బాధపడుతున్న కెప్టెన్ సూర్య వచ్చీరావడంతో బౌండరీ కొట్టడంతోపాటుఆపై క్లార్క్ ఓవర్లో మరో ఫోర్ కొట్టి ఆత్మవిశ్వాసంతో కనిపించాడు. జేమిసన్ ఓవర్లో 2 సిక్సర్లు దంచిన అభిషేక్.. క్లార్క్ ఓవర్లో మరో 2 సిక్సర్లతో చెలరేగాడు. దాంతో పవర్‌ప్లేలో భారత్ 68/2తో నిలిచింది. ఫిలిప్స్ వేసిన ఏడో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లతో విరుచుకుపడిన అభిషేక్ ఆపై హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేశాడు. శాంట్నర్ ఓవర్లో అభిషేక్ చూడముచ్చటైన సిక్సర్‌తో 9వ ఓవర్లోనే టీమిండియా స్కోరు సెంచరీ దాటింది. సోధీ ఓవర్లో 4,4 సాధించిన సూర్య అదే జోరును కొనసాగించలేకపోయాడు. శాంట్నర్ ఓవర్‌లో భారీ షాట్ సంధించబోయి రాబిన్సన్‌కు దొరికిపోయాడు. ఫలితంగా 99 పరుగుల మూడో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. సోధీ బౌలింగ్‌లో 4,6,6తో దుమ్ము రేపిన అభిషేక్ మరో భారీషాట్ కొట్టే యత్నంలో నిష్క్రమించాడు. శివమ్ దూబే (9) నిరాశపర్చగా..ఉన్న కొద్దిసేపూ ధనాధన్ షాట్లతో అలరించిన హార్దిక్ పాండ్యా 16వ ఓవర్లో అవుటయ్యాడు. క్లార్క్ వేసిన 18వ ఓవర్లో రింకూ 6,4తో భారత్ స్కోరు 200 దాటగా..ఇదే ఓవర్లో అక్షర్ (5) నిష్క్రమించాడు. ఆఖరి ఓవర్లో రింకూ సింగ్ 6,6,4,4తో మురిపించడంతో 21 పరుగులు లభించాయి.
స్కోరుబోర్డు
భారత్: శాంసన్ (సి) రచిన్ (బి) జేమిసన్ 10, అభిషేక్ (సి) జేమిసన్ (బి) సోధీ 84, ఇషాన్ (సి) చాప్‌మన్ (బి) డఫీ 8, సూర్యకుమార్ (సి) రాబిన్సన్ (బి) శాంట్నర్ 32, హార్దిక్ (సి) చాప్‌మన్ (బి) డఫీ 25, శివమ్ దూబే (సి అండ్ బి) జేమిసన్ 9, రింకూ సింగ్ (నాటౌట్) 44, అక్షర్ (సి) మిచెల్ (బి) క్లార్క్ 5, అర్ష్‌దీప్ (నాటౌట్) 6; ఎక్స్‌ట్రాలు: 15; మొత్తం 20 ఓవర్లలో 238/7; వికెట్లపతనం : 1-18, 2-27, 3-126, 4-149, 5-166, 6-185, 7-209; బౌలింగ్ : డఫీ 4-0-27-2, జేమిసన్ 4-0-54-2, క్రిస్టియన్ క్లార్క్ 4-0-40-1, సోధీ 3-0-38-1, గ్లెన్ ఫిలిప్స్ 1-0-20-0, శాంట్నర్ 3-0-37-1, మిచెల్ 1-0-21-0.
న్యూజిలాండ్: కాన్వే (సి) శాంసన్ (బి) అర్ష్‌దీప్ 0, రాబిన్సన్ (సి) దూబే (బి) వరుణ్ 21, రచిన్ (సి) అభిషేక్ (బి) హార్దిక్ 1, ఫిలిప్స్ (సి) దూబే (బి) అక్షర్ 78, చాప్‌మన్ (సి) అభిషేక్ (బి) వరుణ్ 39, మిచెల్ (సి-సబ్) బిష్ణోయ్ (బి) దూబే 28, శాంట్నర్ (నాటౌట్) 20, క్లార్క్ (సి) రింకూ (బి) దూబే 0, జేమీసన్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు:2; మొత్తం 20 ఓవర్లలో 190/7; వికెట్ల పతనం : 1-0, 2-1, 3-52, 4-131, 5-143, 6-189, 7-189; బౌలింగ్ : అర్ష్‌దీప్ 4-0-31-1, హార్దిక్ 2-0-20-1, బుమ్రా 3-0-29-0 అక్షర్ 3.3-0-42-1, వరుణ్ 4-0-37-2, శివమ్ దూబే 3-0-28-2, అభిషేక్ 0.3-0-3-0.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆ దేశాలు సుంకాలను ఆయుధాలుగా వాడుతున్నాయి: కెనడా
ఇరాన్‌కు ట్రంప్ మళ్లీ వార్నింగ్.. కుట్ర చేశారో..