రోహిత్ టీ20 రికార్డు బద్దలు.. 30 బంతుల్లోనే అభిషేక్ శర్మ సెంచరీ
ABN , Publish Date - Sep 17 , 2026 | 09:48 PM
అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న టీ20లో భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ విజృంభించాడు. కేవలం 30 బంతుల్లో శతకాన్ని రాబట్టి రోహిత్ రికార్డును అధిగమించాడు.
ఇంటర్నెట్ డెస్క్: అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న టీ20లో భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మ విజృంభించాడు. కేవలం 30 బంతుల్లో శతకాన్ని రాబట్టి రోహిత్ రికార్డును అధిగమించాడు. అత్యంత వేగవంతమైన టీ20 సెంచరీని చేసిన భారత బ్యాట్స్‌మన్‌గా నిలిచాడు. 2017లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ 35 బంతుల్లో సెంచరీ చేసిన విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా వేగవంతమైన టీ20 సెంచరీల్లో ఎస్టోనియాకు చెందిన సాహిల్ చౌహాన్ తొలిస్థానంలో (27 బంతుల్లో శతకం), టర్కీకి చెందిన ముహమ్మద్ ఫహాద్ (29 బంతులు) రెండో స్థానంలో ఉన్నారు.
ఇక పవర్ ప్లే కూడా భారత బ్యాటర్లు అఫ్గాన్ బౌలర్లకు చుక్కలు చూపించారు. తొలి ఆరు ఓవర్లలోనే అభిషేక్ శర్మ-సంజూ శాంసన్ జోడీ 100 పరుగులు రాబట్టింది. భారత టీ20 చరిత్రలో ఇదే అత్యద్భుత ప్రదర్శన. తాజా అఫ్గాన్ మ్యాచ్‌లో భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. 108 పరుగులతో అభిషేక్ శర్మ, 50 పరుగులతో సంజూ శాంసన్ టాప్ స్కోరర్లుగా నిలిచారు. అఫ్గాన్ బౌలర్లు అజ్మతుల్లా, ఒమర్జాయ్ రెండు వికెట్లు పడగొట్టారు. అబ్దుల్లా అహ్మద్జాయ్, రషీద్ ఖాన్ చెరో వికెట్ తీశారు.
ఈ వార్తలనూ చదవండి:
అజిత్ అగార్కర్‌కు పొడిగింపు లేనట్టేనా.. రేసులో పార్ధివ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా