Share News

పదేళ్లకే జాతీయ పోటీలకు.. చిన్నారి షూటర్‌ నైరా శర్మ రికార్డు

ABN , Publish Date - Sep 10 , 2026 | 05:08 AM

ఓ చిన్నారి అతి చిన్న వయసులోనే జాతీయ సీనియర్‌ చాంపియన్‌షి్‌పనకు ఎంపికై సరికొత్త రికార్డు సృష్టించింది...

పదేళ్లకే జాతీయ పోటీలకు.. చిన్నారి షూటర్‌ నైరా శర్మ రికార్డు

న్యూఢిల్లీ: ఓ చిన్నారి అతి చిన్న వయసులోనే జాతీయ సీనియర్‌ చాంపియన్‌షి్‌పనకు ఎంపికై సరికొత్త రికార్డు సృష్టించింది. ఢిల్లీకి చెందిన షూటర్‌ నైరా శర్మ వయసు పది సంవత్సరాల మూడు నెలలు. భోపాల్‌లో జరిగిన ఆలిండియా ఇంటర్‌ స్కూల్‌ షూటింగ్‌ చాంపియన్‌షి్‌పలో నైరా.. 10 మీటర్ల ఎయిర్‌రైఫిల్‌ ఈవెంట్‌లో 400కు గాను 363 పాయింట్లు స్కోరు చేసి త్వరలో జరిగే జాతీయ టోర్నీలో పోటీపడేందుకు అర్హత సాధించింది. దీంతో అతి చిన్న వయసులో జాతీయ చాంపియన్‌షి్‌పనకు ఎంపికైన భారత ప్లేయర్‌గా నైరా అరుదైన ఘనతను అందుకుంది .

ఇవి కూడా చదవండి..

ఎస్-400, ఎస్‌యు-57, బ్రహ్మోస్‌పై భారత్‌ ఫోకస్.. మోదీ-పుతిన్ భేటీలో కీలక చర్చలు..

మరో పదేళ్లలో మనుషుల్ని ఏఐ చంపేయొచ్చు.. ఆంత్రోపిక్‌ పరిశోధకుడి సంచలన హెచ్చరిక..

Updated Date - Sep 10 , 2026 | 05:08 AM