Share News

హీరోయిన్ జరీన్ ఖాన్ తల్లి కన్నుమూత..

ABN , Publish Date - Apr 08 , 2026 | 11:26 AM

ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ తల్లి పర్వీన్ ఖాన్ కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె బుధవారం ఉదయం చనిపోయారు.

హీరోయిన్ జరీన్ ఖాన్ తల్లి కన్నుమూత..
Zareen Khan mother

ముంబై, ఏప్రిల్ 8: ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ తల్లి పర్వీన్ ఖాన్ కన్నుమూశారు. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా 65 ఏళ్ల వయసులో బుధవారం ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని జరీన్ ఖాన్ టీమ్ ధ్రువీకరించింది. ఈ మేరకు జరీన్ ఖాన్ టీమ్‌లోని పియూష్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో ‘జరీన్ ఖాన్, సనా ఖాన్ తల్లి పర్వీన్ ఖాన్ ఏప్రిల్ 8వ తేదీన కన్నుమూశారు. ఈ రోజు ఉదయం 10 గంటలకు అంథేరీ వెస్ట్‌లోని వర్సోవా ఖబరస్థాన్‌లో అంత్యక్రియలు జరుగుతాయి’ అని పేర్కొన్నారు.

Untitled-2 copy.jpg


మార్చి నెలలో పర్వీన్ ఖాన్ ఆరోగ్యం కొంచెం మెరుగుపడింది. వైద్యులు ఆమెను ఐసీయూ నుంచి జనరల్ వార్డ్‌కు షిఫ్ట్ చేశారు. హీరోయిన్ జరీన్ ఖాన్ తల్లి అనారోగ్యం గురించి సోషల్ మీడియా వేదికగా తరచుగా పోస్టులు పెట్టేవారు. ఎప్పటికప్పుడు ఫ్యాన్స్‌కు అప్‌డేట్ ఇచ్చేవారు. కొద్దిరోజుల క్రితం జరీన్ ఖాన్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో తల్లి ఆరోగ్యం గురించి ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘అమ్మను ఐసీయూ నుంచి షిఫ్ట్ చేశారు. కానీ, ఆస్పత్రిలోనే ఉన్నారు. మీరు ఆమె త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తూ ఉండండి. మీ ప్రార్థనలు ఆమెకు చాలా అవసరం’ అని రాసుకొచ్చారు.


తెలుగులోనూ నటించిన జరీన్..

జరీన్ ఖాన్ 2010లో విడుదలైన ‘వీర్’ సినిమాతో చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 2019లో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. గోపీచంద్ హీరోగా నటించిన ‘చాణక్య’ సినిమాలో ఏజెంట్ జుబేదాగా కనిపించారు. హిందీ, తమిళం, తెలుగు, పంజాబీ భాషల్లో 20కిపైగా సినిమాల్లో నటించారు. 2021 నుంచి ఆమె సినిమాలకు దూరంగా ఉంటున్నారు.


ఇవి కూడా చదవండి

గోవుల అక్రమ రవాణా.. అడ్డుకున్న వ్యక్తిపై కత్తులతో దాడి

ఎన్నికల నిర్వహణకు రూ.1,302 కోట్లు

Updated Date - Apr 08 , 2026 | 12:18 PM