Share News

దొంగతనం ఫెయిల్.. అడ్డంగా దొరికిపోయిన దొంగ

ABN , Publish Date - Feb 03 , 2026 | 01:01 PM

బస్సులో దొంగతనం చేయడానికి ప్రయత్నించిన ఓ దొంగకు ఊహించని షాక్ తగిలింది. దొంగతనం చేస్తూ అతడు అడ్డంగా దొరికిపోయాడు. ప్రస్తుతం ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

దొంగతనం ఫెయిల్.. అడ్డంగా దొరికిపోయిన దొంగ
mobile snatching viral

ఇంటర్‌నెట్ డెస్క్: రన్నింగ్‌లో ఉన్న బస్సులో దొంగతనం చేయడానికి ప్రయత్నించిన ఓ దొంగకు ఊహించని షాక్ తగిలింది. దొంగతనం చేస్తూ అతడు అడ్డంగా దొరికిపోయాడు. తప్పించుకోవడానికి నానా కష్టాలు పడ్డాడు. అయినా కూడా లాభం లేకుండా పోయింది. ప్రయాణీకుల చేతిలో దెబ్బలు తిని జైలు పాలయ్యాడు. ఇంతకీ ఏం జరిగిందంటే.. కొన్ని రోజుల క్రితం ఓ దొంగ రన్నింగ్‌లో ఉన్న బస్సులో సెల్ ఫోన్ చోరీ చేయడానికి ప్రయత్నించాడు. సెల్ ఫోన్ చేతుల్లోకి తీసుకున్న వెంటనే పక్కనే ఉన్న ప్రయాణీకులు చూశారు. గట్టిగా అరుస్తూ అతడ్ని పట్టుకునే ప్రయత్నం చేశారు.


ఆ దొంగ వారి నుంచి తప్పించుకోవటానికి బస్సు కిటికీ నుంచి కిందకు దూకి పారిపోయే ప్రయత్నం చేశాడు. అయితే, ప్రయాణీకులు గట్టిగా అతడ్ని పట్టుకోవటంతో మధ్యలోనే ఇరుక్కుపోయాడు. బస్సు ఆగింది. ప్రయాణీకులు అతడ్ని బాగా కొట్టి పోలీసులకు అప్పగించారు. ఈ సంఘటన ఎప్పుడు? ఎక్కడ? జరిగిందన్న దానిపై క్లారిటీ లేదు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. దొంగ కిటికీలో ఇరుక్కుపోయాడు. కాళ్లు మొత్తం రోడ్డు వైపు ఉన్నాయి.


అతడు కిందకు దూకడానికి చాలా ప్రయత్నిస్తూ ఉన్నాడు. అయినా అతడి వల్ల కావటం లేదు. లోపల ఉన్న ప్రయాణీకులు బయట ఉన్న వారి సాయంతో దొంగను పూర్తిగా బస్సులోకి లాగేశారు. అతడికి బాగా దేహ శుద్ధి చేశారు. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘ఈ దొంగకు వచ్చిన కష్టం పగవాడికి కూడా రాకూడదు. మరీ కామెడీగా దొరికిపోయాడు. కొత్తగా ఫీల్డ్‌లోకి వచ్చినట్లు ఉన్నాడు’.. ‘ఈ మధ్య బస్సులలో సెల్ ఫోన్ దొంగతనాలు బాగా పెరిగిపోయాయి. ఇలాంటి వారిని ఊరికే వదిలేయకూడదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి

బీ ఫామ్‌ దక్కేదెవరికో..?

అలాంటి వారికి పోలీసు ట్రీట్మెంట్ ఖాయం.. మంత్రి అనిత వార్నింగ్

Updated Date - Feb 03 , 2026 | 01:09 PM