Share News

సన్నీ లియోన్ కూతురి అద్భుత సృష్టి.. 10 ఏళ్ల వయసులోనే లక్షల సంపాదన

ABN , Publish Date - Mar 05 , 2026 | 08:11 AM

సన్నీ లియోన్ కూతురు నిశా కౌర్ వెబర్ 10 ఏళ్ల వయసులోనే అద్భుతాన్ని సృష్టించింది. ‘బూ బాక్స్’ అనే వస్తువును తయారు చేసింది. దాన్ని ఆన్‌లైన్ ద్వారా అమ్మకానికి కూడా పెట్టింది.

సన్నీ లియోన్ కూతురి అద్భుత సృష్టి.. 10 ఏళ్ల వయసులోనే లక్షల సంపాదన
Sunny Leone daughter

ఇంటర్‌నెట్ డెస్క్: బాలీవుడ్ నటి సన్నీ లియోన్ కూతురు నిశా కౌర్ వెబర్ 10 ఏళ్ల వయసులోనే అద్భుతాన్ని సృష్టించింది. ‘బూ బాక్స్’ అనే వస్తువును తయారు చేసింది. దాన్ని ఆన్‌లైన్ ద్వారా అమ్మకానికి కూడా పెట్టింది. బాలీవుడ్ డైరెక్టర్ ఫరా ఖాన్ యూట్యూబ్ వ్లాగ్ చేయటం కోసం తాజాగా సన్నీ లియోన్ ఇంటికి వెళ్లింది. ఈ సందర్భంగా సన్నీ లియోన్ తన కూతురు నిశా గురించి చెబుతూ.. ‘తను చాలా తెలివైనది. తను తయారు చేసిన ఓ వస్తువును నీకు చూపిస్తాను. దానికి పేటెంట్ కూడా ఉంది. మొదటి నుంచి చివరి వరకు మొత్తం తనే చేసింది’..


‘దీన్ని బూ బాక్స్ అంటారు. తనకు డస్ట్ అలర్జీ ఉంది. ముంబైలోని చాలా మంది పిల్లల పరిస్థితి ఇదే. తను టిష్యూ పేపర్లు వాడి ఇంట్లో ఎక్కడ పడితే అక్కడ పడేసేది. నేను తనను తిట్టేదాన్ని. ఓ రోజ టిష్యూ బాక్స్‌కు డిస్పోజబుల్ కప్ టేప్ సాయంతో అతికించింది. నేను దాన్ని చూసి బాగా నవ్వుకున్నాను. ఇప్పుడు నా ఇద్దరు కొడుకులు నిశాను చూసి అసూయ పడుతున్నారు. నిశా దగ్గర ఇప్పుడు చాలా డబ్బులు ఉన్నాయి. వాళ్లు తనను డబ్బులు అడుగుతూ ఉన్నారు. తను పదేళ్ల వయసులోనే డబ్బులు సంపాదిస్తోంది’ అని చెప్పుకొచ్చింది.


ఆన్‌లైన్‌లో అమ్మకానికి బూ బాక్స్..

నిశా తయారు చేసిన బూ బాక్స్ చాలా మార్పుల తర్వాత ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చింది. సన్నీ లియోన్ దంపతులు దానికి పేటెంట్ కూడా తీసుకున్నారు. ఆన్‌లైన్‌లో బూ బాక్స్ ధర 700 రూపాయలనుంచి 1000 రూపాయల వరకు ఉంది. ఈ బూ బాక్స్ ప్రత్యేకత ఏంటంటే.. సాధారణంగా టిష్యూ పేపర్లను వాడిన తర్వాత పడేయటానికి డస్ట్ బిన్ కోసం వెతుక్కోవాల్సి ఉంటుంది. కానీ, బూ బాక్స్‌ మన దగ్గర ఉంటే ఆ అవసరం ఉండదు. బూ బాక్స్‌లో రెండు ప్రత్యేకమైన అరలు ఉన్నాయి. ఓ అరలో టిష్యూలు ఉంటాయి. వాటిని వాడిన తర్వాత పక్కనే ఉన్న అరలో పడేయవచ్చు.


ఇవి కూడా చదవండి

ఇస్రో యువిక.. విద్యార్థులకు ఆహ్వానం

కుక్కలు లాక్కెళ్లి.. పొదల్లో పడేశాయ్‌

Updated Date - Mar 05 , 2026 | 08:19 AM