Share News

8 ఏళ్లలో ఒక్కసారి కనిపించే హిమాలయ పుష్పం.. వీడియో వైరల్

ABN , Publish Date - Apr 08 , 2026 | 09:44 PM

ప్రకృతి సృష్టించే వింతలు అన్నీ ఇన్నీ కావు.. సోషల్ మీడియాలో మంచు పలకల మధ్య ఎంతో అందంగా వికసించిన ‘మంచు కమలం’ వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.

8 ఏళ్లలో ఒక్కసారి కనిపించే హిమాలయ పుష్పం.. వీడియో వైరల్
Snow Lotus Viral Video

ఇంటర్నెట్ డెస్క్: ప్రకృతి సృష్టించే వింతలు అన్నీ ఇన్నీ కావు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్లను మంత్ర ముగ్ధులను చేస్తోంది. మంచు పలకల మధ్య ఎంతో అందంగా వికసించిన ‘మంచు కమలం’ (Snow Lotus) వీడియో ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అత్యంత అరుదైన ఈ పువ్వు గురించి ఆసక్తికరమైన విషయాలు మీ కోసం..


హిమాలయాలు, టియాన్‌షాన్ పర్వత శ్రేణులలోని సుమారు 3,000 నుండి 5,000 మీటర్ల ఎత్తులో, గడ్డకట్టే చలిలో ఇవి పెరుగుతాయి. ఒక మొక్క పరిపక్వం చెంది పువ్వు పూయడానికి కనీసం 5 నుంచి 8 సంవత్సరాల సమయం పడుతుంది. లేత పసుపు రంగులో పొరలు పొరలుగా కమలం పువ్వులా కనిపిస్తుంది. ఈ సుదీర్ఘ నీరీక్షణ తర్వాత పూసే ఈ పువ్వును చూడటం ఒక అరుదైన అవకాశంగా భావిస్తారు. మంచు కమలం కేవలం అందానికే కాదు, అపారమైన ఔషద విలువలు కలిగివుంది. టిబెట్, చైనీస్ వైద్యంలో దీనిని దశాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. మంటను తగ్గించడానికి, రక్త ప్రసరన మెరుగుపరచడానికి ఇది సహాయపడుతుంది. పర్వత ప్రాంత ప్రలు దీనిని ఒక పవిత్రమైన మూలికగా భావిస్తారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కృష్ణపట్నం పోర్టులోకి తమిళనాడు బోటు అక్రమ చొరబాటు.. పట్టుకున్న టాస్క్‌ఫోర్స్

రూ.185 కోట్లతో విజయవాడ స్టేడియం అభివృద్ధి: మంత్రి మండిపల్లి..

Updated Date - Apr 08 , 2026 | 09:44 PM