Share News

మీ దృష్టి పర్‌ఫెక్ట్‌గా ఉంటుందా?.. అయితే ఈ ఫొటోలోని 3 బాతులు ఎక్కడ దాక్కున్నాయో పట్టుకోండి..

ABN , Publish Date - Mar 12 , 2026 | 09:39 AM

బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

మీ దృష్టి పర్‌ఫెక్ట్‌గా ఉంటుందా?.. అయితే ఈ ఫొటోలోని 3 బాతులు ఎక్కడ దాక్కున్నాయో పట్టుకోండి..
Optical Illusion

ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ స్వాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి.


వైరల్ అవుతున్న పై ఫొటో మీ కళ్ల సామర్థ్యాన్ని టెస్ట్‌ చేసే ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్‌. ఆ ఫొటోలో ఓ బాతు సరస్సులో ఉంది. ఇంకా ఆ ఫొటోలో మొక్కలు, నీళ్లు కూడా ఉన్నాయి. అయితే ఆ ఫొటోలో మరో మూడు బాతులు కూడా ఉన్నాయి. 5 సెకెన్ల వ్యవధిలో ఆ బాతులను కనిపెడితే మీ పరిశీలనా శక్తికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేయడంలో పజిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి.


సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది. చాలా తక్కువ మంది మాత్రమే 5 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? ఈ కింది ఫొటో చూడండి.. ఈ ఫొటోలో మూడు బాతులు ఎక్కడ దాక్కున్నాయో తెలుస్తుంది.

puzzle2.jpg


ఇవి కూడా చదవండి..

స్థిరంగా బంగారం, స్వల్పంగా తగ్గిన వెండి.. ఈ రోజు ధరలు ఎలా ఉన్నాయంటే..


ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగాలు.. కూతురితో కలిసి వీక్షించిన కిమ్..

Updated Date - Mar 12 , 2026 | 10:18 AM