మీ కళ్లు చురుకైనవి అయితే.. తప్పు స్పెల్లింగ్‌తో ఉన్న పదాన్ని 15 సెకెన్లలో కనిపెట్టండి..
ABN , Publish Date - Mar 22 , 2026 | 03:14 PM
ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు. తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
బ్రెయిన్ టీజర్ గేమ్స్, క్లిష్టమైన పజిల్స్ సాల్వ్ చేయడం వంటి ప్రక్రియలు మనకు నిజ జీవితంలో ఎదురయ్యే సమస్యల గురించి ఆలోచించడంలో సహాయపడతాయి. పజిల్స్ (Puzzle), ఆప్టికల్ ఇల్యూజన్స్ (Optical Illusion) మీ బ్రెయిన్ సామర్థ్యానికి పరీక్ష పెడతాయి. ఎన్నో తరాలుగా అన్ని వయసుల వారికి ఈ పజిల్స్ మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తున్నాయి. వాటిని సాల్వ్ చేసినపుడు కలిగే ఆనందం అంతా ఇంతా కాదు.తరచుగా పజిల్స్ పరిష్కరించడం ద్వారా మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.
వైరల్ అవుతున్న పై ఫొటో మీ బ్రెయిన్ సామర్థ్యాన్ని టెస్ట్ చేసే ఆప్టికల్ ఇల్యూజన్ పజిల్ టెస్ట్. ఆ ఫొటోలో వివిధ వరుసల్లో ఆంగ్ల పదాలు కనబడుతున్నాయి. Love పదాలు వివిధ వరుసల్లో ఉన్నాయి. అయితే వాటిల్లో ఒక పదంలో మాత్రం స్పెల్లింగ్ కాస్త తప్పుగా ఉంది. ఆ తప్పు స్పెల్లింగ్‌తో ఉన్న పదం ఎక్కడుందో కనిపెట్టడమే ఈ ఫొటోలోని ఛాలెంజ్. ఆ పదాన్ని 15 సెకెన్ల వ్యవధిలో కనిపెడితే మీ పరిశీలనా శక్తికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. మన ఆలోచనా నైపుణ్యాలను పెంచడం ద్వారా సమస్యలను పరిష్కరించడానికి, కొత్త పరిష్కారాలను కనుగొనడానికి మన మెదడును సిద్ధం చేయడంలో పజిల్స్ కీలక పాత్ర పోషిస్తాయి.
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఆప్టికల్ ఇల్యూజన్ ఫొటోలు, పజిల్స్ బాగా వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం అలాంటిదే ఓ ఫొటో వైరల్ అవుతోంది. చాలా తక్కువ మంది మాత్రమే 15 సెకెన్ల వ్యవధిలో ఈ పజిల్‌ను సాల్వ్ చేయగలిగారు. మీరు కనిపెట్టగలిగారా? అయితే కంగ్రాట్స్.. కనిపెట్టలేకపోయారా? ఈ కింది ఫొటో చూడండి.. ఆ తప్పుడు స్పెల్లింగ్‌తో ఉన్న పదం ఎక్కడుందో మీకు కనబడుతుంది.

పైన ఫోటోలో మార్క్ చేసిన పదంలో Oకు బదులుగా సున్నా (0) ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి..
హామీల అమలుకే నిధులు లేవు.. మూసీ ప్రక్షాళనకు డబ్బులు ఎక్కడివి?: టీ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు
ఆర్టీసీలో సూపర్‌వైజర్ ఉద్యోగాలకు హాల్ టికెట్లు విడుదల.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..