Share News

రూ.25 లక్షల జీతాన్ని కాదనుకుని ట్యాక్సీ డ్రైవర్‌గా చేరితే..

ABN , Publish Date - Apr 23 , 2026 | 08:43 AM

రూ.25 లక్షల జీతమిచ్చే ఉద్యోగాన్ని వదులుకుని క్యాబ్ డ్రైవర్‌గా మారిన ఓ వ్యక్తి విజయవంతమైన వ్యాపారస్తుడిగా మారిపోయాడు. మూడేళ్ల వ్యవధిలోనే కోట్లల్లో వ్యాపారం చేసే స్థాయికి ఎదిగాడు.

రూ.25 లక్షల జీతాన్ని కాదనుకుని ట్యాక్సీ డ్రైవర్‌గా చేరితే..
Entrepreneurship Success Story

ఇంటర్నెట్ డెస్క్: ఎమ్‌బీయే చదువు.. కార్పొరేట్ కంపెనీలో జాబ్.. రూ.25 లక్షల వార్షిక శాలరీ.. నేటి యువత కలలుగనే జీవితం అతడి సొంతం. ఇవన్నీ కాదనుకున్న అతడు జాబ్‌కు రాజీనామా చేసి ట్యాక్సీ డ్రైవర్‌గా మారాడు. ఆ తరువాత అతడి లైఫ్ ఎలాంటి మలుపు తిరిగిందో చెప్పే ఓ ఉదంతం ప్రస్తుతం నెట్టింట ట్రెండింగ్‌లో కొనసాగుతోంది. @portfolio_bull పేరిట ఉన్న ఎక్స్ అకౌంట్‌లోని ఈ ఉదంతం వైరల్‌గా మారింది.

ఎక్స్ పోస్టులోని వివరాల అనేక మంది కలలుగనే జీవితం ఆ యువకుడి సొంతమైనా ఆనందం, సంతృప్తి మాత్రం లభించలేదు. నిరంతరం ఒత్తిడి, క్షణం తీరిక లేకుండా గడిచిపోతున్న రోజులు అతడిలో నిరాశను పెంచాయి. ఈ నేపథ్యంలో అతడు జాబ్‌కు గుడ్ బై చెప్పేశాడు. క్యాబ్ డ్రైవర్‌గా మారిపోయాడు. మొదట్లో అతడి నిర్ణయంపై కుటుంబం, స్నేహితులు, బంధువుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. అంత చదువును వృథా చేసుకున్నావని అనేక మంది విమర్శించారు. బంగారం లాంటి కెరీర్‌ను కాలదనుకున్నందుకు మందలించారు.


కానీ యువకుడు మాత్రం వెనక్కు తగ్గలేదు. పనిపైనే దృష్టి పెట్టాడు. ఎమ్‌బీఏ డిగ్రీ ఇచ్చిన నైపుణ్యాలతో వ్యాపార అవకాశాలను సృష్టించుకున్నాడు. దీంతో, మూడేళ్లల్లోనే అతడి జీవితం గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. క్యాబ్ డ్రైవర్ నుంచి పలు కార్ల యజమానిగా అయిపోయాడు. 12 కార్లతో బిజినెస్ నిర్వహించే స్థాయికి చేరుకున్నాడు. వ్యాపారస్థుడిగా మంచి విజయాన్ని అందుకున్నాడు. రూ.25 లక్షల వార్షిక శాలరీ నుంచి నెలకు రూ.6.4 లక్షల లాభం ఆర్జించే స్థాయికి చేరుకున్నాడు. దీంతో, ఈ పోస్టుకు యువ వృత్తి నిపుణుల నుంచి మంచి స్పందన వచ్చింది.

Updated Date - Apr 25 , 2026 | 10:40 PM