విరాట్ జెర్సీ కోసం చిన్నారి మంకుపట్టు.. వైరల్‌గా మారిన వీడియో..
ABN , Publish Date - Mar 18 , 2026 | 05:45 PM
ఓ చిన్నారి తను ఎంతగానో అభిమానించే విరాట్ కోహ్లీ జెర్సీ కోసం మంకుపట్టు పట్టింది. చివరకు తను అనుకున్నది సాధించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇంటర్‌నెట్ డెస్క్: స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీకి ప్రపంచ వ్యాప్తంగా ఫ్యాన్స్ ఉన్నారు. కోహ్లీ అద్భుతమైన తన ఆటతో చిన్న పిల్లల దగ్గరి నుంచి వృద్ధుల వరకు అన్ని వర్గాల వారి అభిమానాన్ని సొంతం చేసుకున్నారు. తాజాగా, ఓ చిన్నారి తను ఎంతగానో అభిమానించే విరాట్ కోహ్లీ జెర్సీ కోసం మంకుపట్టు పట్టింది. చివరకు తను అనుకున్నది సాధించింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఏముందంటే.. ఓ చిన్నారి తన తండ్రితో కలిసి బట్టల షాపునకు వెళ్లింది.
తనకు విరాట్ కోహ్లీ జెర్సీ కావాలని చిన్నారి అడగటంతో.. షాపు అతను టీమ్ ఇండియాకు సంబంధించిన విరాట్ కోహ్లీ జెర్సీ ఇచ్చాడు. పాప దాన్ని తీసుకోవడానికి ఒప్పుకోలేదు. అక్కడ హ్యాంగర్‌కు తగిలించి ఉన్న ఆర్సీబీ జట్టుకు సంబంధించిన జెర్సీ దగ్గరకు వెళ్లింది. దాన్ని చూపించి అలాంటి రంగుల్లో విరాట్ కోహ్లీ జెర్సీ కావాలని అడిగింది. షాపు అతను తన దగ్గర ఉన్న ఆర్సీబీకి సంబంధించిన విరాట్ కోహ్లీ జెర్సీ ఇచ్చాడు. ఆ చిన్నారి జెర్సీని ధరించి ఎంతో మురిసిపోయింది. బ్యాట్‌తో బాల్‌ను కొడుతున్నట్లు ఫోజులు కూడా ఇచ్చింది.
సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన వీడియోపై ప్రముఖ స్పోర్ట్స్ బ్రాండ్ పుమా క్రికెట్ స్పందించింది. ఆ చిన్నారికి నంబర్ 18 ఉండే విరాట్ కోహ్లీ జెర్సీ పంపిస్తామని తెలిపింది. ఆ చిన్నారి అడ్రస్ కనుక్కునేందుకు సహకరించాలని నెటిజన్లను కోరింది. ఇక, ఈ వీడియోపై స్పందిస్తున్న నెటిజన్లు.. ‘క్రికెట్‌లో ది బెస్ట్ అంటే విరాట్ కోహ్లీనే. అతడికి సాటి ఎవరూ లేరు’..‘కోహ్లీకి చిన్న పిల్లల్లో చాలా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది’..‘విరాట్ ఇప్పటి వరకు సంపాదించిన ఆస్తి ఇదే’.. అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
రెయిన్ అలర్ట్.. అల్పపీడనంతో ఏపీలో భారీ వర్షాలు..
ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ ఇంటెలిజెన్స్ మంత్రి ఇస్మయిల్ ఖతీబ్ మృతి