పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్.. 6 నెలలు నరకం చూసిన కియారా అద్వానీ..
ABN , Publish Date - May 10 , 2026 | 08:55 PM
కియారా అద్వానీ ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2023లో వీరి పెళ్లి జరిగింది. 2025 జులై నెలలో ఈ జంటకు ఓ పాప పుట్టింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కియారా పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌తో అల్లాడిపోయారట
ఇంటర్‌నెట్ డెస్క్: తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు ‘కియారా అద్వానీ’. 2018లో విడుదలైన ‘భరత్ అనే నేను’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యారు. తెలుగులో ఇప్పటి వరకు చేసింది తక్కువ సినిమాలే అయినా తనకంటూ మంచి ఫ్యాన్ బేస్‌ను సొంతం చేసుకున్నారు. చివరగా గేమ్ ఛేంజర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. పెళ్లి తర్వాత సినిమాల మీద ఫోకస్ తగ్గించారు.
6 నెలల నరకం..
కియారా అద్వానీ ప్రముఖ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ్ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2023లో వీరి పెళ్లి జరిగింది. 2025 జులై నెలలో ఈ జంటకు ఓ పాప పుట్టింది. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కియారా పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్‌తో అల్లాడిపోయారట. 6 నెలల పాటు నరకం చూశారాట. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ఆమె మాట్లాడుతూ.. ‘మాతృత్వం అనేది ఒక సంపూర్ణ గుర్తింపును ఇచ్చే మార్పు. అదొక సరికొత్త ప్రపంచం. ఆ క్షణంలో ఆ పరిస్థితిని అనుభవిస్తున్న మహిళ తనను తాను శాంతపరచుకోవడం చాలా కష్టం’..
‘దానికి చాలా సమయం పడుతుంది. నాకు ఆరు నెలలు పట్టింది. ఆ ఆరు నెలలు నరకం చూశాను. నాకు నేను సర్ది చెప్పుకున్నాను. కొన్నిసార్లు మనం చేసే పనుల గురించి అతిగా ఆలోచించి భయపడుతుంటాం. నేను భయం మీద ఫోకస్ చేయకూడదని నేర్చుకున్నాను. ఇవన్నీ కేవలం ఆరు నెలల కాలంలోనే నేర్చుకున్నాను’ అని అన్నారు. కాగా, యశ్ హీరోగా తెరకెక్కిన టాక్సిక్ సినిమాలో కియారా హీరోయిన్‌గా చేశారు. ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇవి కూడా చదవండి
బెంగాల్ ఉత్సాహమే తెలంగాణలో కనిపిస్తోంది... తదుపరి టార్గెట్‌పై సంకేతాలిచ్చిన మోదీ
మోదీ ఆశీస్సులు, మార్గదర్శనం నాకు ఎప్పటికీ ప్రత్యేకం: పవన్ కల్యాణ్