బస్సు మలుపు తిరుగుతుండగా తెరుచుకున్న తలుపు.. కిందపడిన స్టూడెంట్స్
ABN , Publish Date - Mar 31 , 2026 | 04:55 PM
కదులుతున్న బస్సులోంచి ఇద్దరు పదవ తరగతి విద్యార్థులు కింద పడిపోయిన ఘటన కర్ణాటకలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఇంటర్నెట్ డెస్క్: పదవ తరగతి పరీక్షలు రాసేందుకు వెళుతూ ఆర్టీసీ బస్సులోంచి ఇద్దరు విద్యార్థినులు కిందపడ్డ ఘటన కర్ణాటకలో తాజాగా వెలుగు చూసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. విద్యార్థినులు ఇద్దరూ అక్కాచెల్లెళ్లు. మంగళూరులోని బెల్తంగడి తాలూకా కాలియా గ్రామం వద్ద ఈ ఘటన జరిగింది.
ఘటన సమయంలో బస్సులో సుమారు 86 మంది ప్రయాణికులు ఉన్నట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. రద్దీ ఎక్కువగా ఉండటంతో అక్కాచెల్లెళ్లు ఇద్దరూ మెట్ల వద్ద నిలబడ్డారు. ఈ క్రమంలో బస్సు మలుపు తిరుగుతుండగా అకస్మాత్తుగా మెట్ల వద్ద ఉన్న డోర్ తెరుచుకోవడంతో విద్యార్థినులు జారి కిందపడిపోయారు.
అక్కాచెల్లెళ్లు ఒకరి తరువాత మరొకరు పడిపోయినట్టు సీసీటీవీ ఫుటేజీలో రికార్డు అయ్యింది. ఇద్దరికీ గాయాలు కావడంతో వారిని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఇక ఈ ఘటనపై కేఎస్‌ఆర్‌టీసీ దర్యాప్తు ప్రారంభించింది.
ఈ వార్తలూ చదవండి:
రిస్క్ తీసుకున్న ఫలితం.. రూ.20 లక్షలతో 3 కోట్ల సంపద సొంతం
వామ్మో.. విమానాల్లో కూడా జనాలు ఇంతేనా! ఫొటోలు వైరల్