Share News

న్యూయార్క్‌ వీధుల్లో భారతీయ వివాహం.. ఎలా చేశారో చూస్తే..

ABN , Publish Date - Apr 28 , 2026 | 07:56 PM

న్యూయార్క్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే వీధుల్లో ఫిఫ్త్ అవెన్యూ ఒకటి. అలాంటి ప్రాంతాన్ని.. భారతీయ వధూవరులు ఒక్కసారిగా ఒక బాలీవుడ్ సినిమా సెట్‌లా మార్చేశారు.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.

న్యూయార్క్‌ వీధుల్లో భారతీయ వివాహం.. ఎలా చేశారో చూస్తే..
Indian wedding New York

ఇంటర్నెట్ డెస్క్: న్యూయార్క్ నగరంలోని అత్యంత రద్దీగా ఉండే వీధుల్లో ఫిఫ్త్ అవెన్యూ ఒకటి. అటువంటి ప్రాంతాన్ని.. భారతీయ వధూవరులు ఒక్కసారిగా ఒక బాలీవుడ్ సినిమా సెట్‌లా మార్చేశారు. పంక్తి దోషి, డాక్టర్ అవిష్ జైన్ తమ వివాహ వేడుకను కేవలం కుటుంబ వేడుకగా కాకుండా.. న్యూయార్క్ నగరానికే ఒక అద్భుత దృశ్యంగా మార్చి సోషల్ మీడియాలో సంచలనం సృష్టించారు. సాధారణంగా భారతీయ వివాహాల్లో బరాత్ అంటే బ్యాండ్ మేళం, డీజే పాటలు, బంధువుల డ్యాన్సులు ఉంటాయి. కానీ సంగీతంపై మక్కువ ఉన్న ఈ జంట తమ బరాత్‌ను ఒక పూర్తిస్థాయి లైవ్ పర్ఫార్మెన్స్‌గా మార్చేశారు.


ఈ ఊరేగింపులో విశేషమేమిటంటే.. వధూవరులిద్దరూ చేతుల్లో మైక్రోఫోన్లు పట్టుకుని, బాలీవుడ్ చార్ట్‌బస్టర్ పాటలు పాడుతూ ఫిఫ్త్ అవెన్యూలో ముందుకు సాగారు. పాటలు పాడుతూనే వారు చేసిన నృత్యం అక్కడి స్థానికులను, పర్యాటకులను మంత్రముగ్ధులను చేసింది. వారి బంధువులు, స్నేహితులు అధిక సంఖ్యలో పాల్గొని సందడి చేశారు. ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే వీధుల్లో ఒకటైన ఫిఫ్త్ అవెన్యూ ప్రాంతం.. భారతీయ వివాహంతో మారుమోగిపోయింది.


ఇదిలా ఉంటే.. ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి. చాలా మంది నెటిజన్లు ఆ జంట సృజనాత్మకతను, ఆత్మవిశ్వాసాన్ని ప్రశంసించారు. మరికొంతమంది రద్దీగా ఉండే ఫిఫ్త్ అవెన్యూ వంటి ప్రాంతాల్లో ఇలాంటి భారీ ప్రదర్శనల వల్ల ఎంతోమంది ట్రాఫిక్ ఇబ్బందులు పడి ఉంటారని విమర్శిస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ జంట వీడియో తెగ వైరల్ అవుతోంది.


ఇవి కూడా చదవండి..

సిక్కింలో ఫుట్‌బాల్ ఆడిన ప్రధాని మోదీ.. ఫొటోలు వైరల్..

న్యాయవ్యవస్థపై గౌరవం.. కానీ సత్యాగ్రహం తప్పదు: కేజ్రీవాల్

Updated Date - Apr 28 , 2026 | 09:16 PM